Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఈ ఏడాది చివరికల్లా 5జీ సేవలు.. మొత్తం 16 దరఖాస్తులు

Webdunia
మంగళవారం, 4 మే 2021 (18:31 IST)
దేశంలో ఈ ఏడాది చివరికల్లా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ట్రయల్స్ నిర్వహించేందుకు 13 కంపెనీల దరఖాస్తులను ప్రభుత్వం ఆమోదించింది. చైనా కంపెనీలైన హువావే, జెడ్‌టీఈలను 5 జీ ట్రయల్‌కు దూరంగా ఉంచారు. 5 జి ట్రయల్స్ కోసం టెలికం విభాగానికి మొత్తం 16 దరఖాస్తులు వచ్చాయి.
 
5 జీ ట్రయల్ కోసం ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 
 
టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రంను 1984లో స్థాపించారు. భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా, రిలయన్స్ జియో సంస్థలు ఎరిక్సన్, నోకియాకు చెందిన విక్రేతలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.
 
5 జీ ట్రయల్ కోసం టెలికాం కంపెనీలకు త్వరలో 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ ఎయిర్ వేవ్స్ ఇవ్వనున్నట్లు టెలికం విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇకపోతే.. 5జీ సేవలను మొదట దక్షిణ కొరియా, చైనా, యునైటెడ్ స్టేట్స్ లో ప్రవేశపెట్టారు.
 
5జీ ట్రయల్స్‌ ప్రారంభించేందుకు భారత్ సన్నాహాలు చేస్తున్నప్పటికీ.. ఈ రకం సేవలు ఇప్పటికే 68 దేశాల్లో ప్రారంభమయ్యాయి. ఇందులో శ్రీలంక, ఒమన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ వంటి అనేక చిన్న దేశాలు కూడా ఉండటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments