Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ ఫోన్లపై కరోనా ప్రభావం... మే నెలాఖరుకు 4 కోట్ల ఫోన్లు మాయం

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (14:08 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు మొబైల్ ఫోన్లను కూడా వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా మే నెలాఖరు నాటికి ఏకంగా నాలుగు కోట్ల ఫోను మాయం కానున్నాయట. కరోనా వైరస్‌కు మొబైల్ ఫోన్లకు సంబంధం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి పాక్షికంగా లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ.. మొబైల్ ఫోన్ల విక్రయాలకు, రిపేర్ షాపులకు అనుమతులు లేవు. 
 
అంతేకాకుండా, ప్రస్తుతం మే మూడో తేదీ వరకు అమల్లో ఉన్న లాక్‌డౌన్ మే నెలాఖరు వరకు కొనసాగిన పక్షంలో 4 కోట్ల మొబైల్ ఫోన్లు చెడిపోయే ఆస్కారం ఉందట. 
 
మొబైల్ ఫోన్ల హ్యాండ్ సెట్లలలో వచ్చే లోపాలు, బ్రేక్ డౌన్‌లు వంటి కారణంగా అవి ఉపయోగపడకపోవచ్చని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇదే విష‌యాన్ని ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ పేర్కొంది. 
 
మొబైల్ ఫోన్ల విడిభాగాలు అందుబాటులో లేకపోవడం, కొత్త హ్యాండ్‌సెట్ల విక్రయాలపై ఆంక్షల కారణంగా ఇప్పటికే దాదాపు 2.5 కోట్ల మంది ఫోన్లు నిరుపయోగంగా మారాయని అంచనా వేసింది.
 
అలాగే, హ్యాండ్‌సెట్లలో తలెత్తే లోపాలు, బ్రేక్‌డౌన్ల వల్ల మరికొన్ని మొబైల్స్‌ నిరుపయోగంగా మారే అవకాశం ఉందని తెలిపింది. 130 కోట్ల దేశ జనాభాలో ప్రస్తుతం 85 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని, నెలకు 2.5 కోట్ల ఫోన్ అమ్మకాలు జ‌రుగుతున్న‌ట్లు వివ‌రించింది. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments