Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్షల్లో భారతీయ టెక్కీలకు ఉద్వాసన : సీక్రెట్ బహిర్గతం చేసిన హెడ్‌హంటర్స్ ఇండియా

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరితో ఐటీ ఉద్యోగులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎపుడు ఉద్యోగం ఊడుతుందోనన్న ఆందోళనలో వారు ఉంటున్నారు. అంటే.. తమ ఉద్యోగాలు దినదినగండంగా మారాయి.

Webdunia
సోమవారం, 15 మే 2017 (08:36 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరితో ఐటీ ఉద్యోగులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎపుడు ఉద్యోగం ఊడుతుందోనన్న ఆందోళనలో వారు ఉంటున్నారు. అంటే.. తమ ఉద్యోగాలు దినదినగండంగా మారాయి. డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేస్తున్నాయి. ఇలా ఉద్యోగాలు కోల్పోనున్న భారతీయ టెక్కీల సంఖ్య సుమారుగా 55 వేల వరకు ఉండొచ్చని ఐటీ రంగ నిపుణులు అంచనా వేశారు. 
 
వాస్తవానికి ఈ సంఖ్య లక్షల్లో ఉండనుంది. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్‌ల ఎంపికలో సాయపడే హెడ్‌హంటర్స్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది ఐటీ సంస్థల్లోని 56 వేల మంది ఉద్యోగాలు కోల్పోతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, నిజానికి ఆ సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని చెప్పి గుబులు రేపింది. 
 
అంతేకాదు వచ్చే మూడేళ్లలోనూ అంతే సంఖ్యలో ఉద్యోగులు ఉద్వాసనకు గురికాక తప్పదని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన కె.లక్ష్మీకాంత్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఐటీ ఉద్యోగుల్లో దాదాపు సగం మంది రాబోయే మూడునాలుగేళ్ల అవసరాలకు తగినట్టు ఉండరని నివేదిక పేర్కొంది. అంటే అటువంటి వారికి సంస్థలు చెక్ చెప్పడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments