Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ఎమ్మెల్యేలు.. ఎంపీలకు చంద్రబాబు పదవులు ఇవ్వనన్నారు... ఎంపీ మురళీమోహన్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ గిరిపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు కె.మురళీమోహన్ ఆశపడ్డారు. ఆ వెంటనే తన మనసులోని మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడ

Webdunia
సోమవారం, 15 మే 2017 (08:19 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ గిరిపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు కె.మురళీమోహన్ ఆశపడ్డారు. ఆ వెంటనే తన మనసులోని మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, నాలుగు హితవచనాలు చెప్పి పంపారు. పొద్దస్తమానం పదవులపై ధ్యాసేనా.. రాష్ట్రాభివృద్ధిపై కాస్తైనా మనస్సు పెట్టండంటూ సుతిమెత్తగా హెచ్చరించినట్టు సమాచారం. 
 
ఈ విషయాన్ని మురళీమోహనే స్వయంగా వెల్లడించారు. అడిగిన వారందరికీ పదవులు ఇచ్చుకుంటూ వెళ్తే రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టలేనని చంద్రబాబు అన్నారని చెప్పారు. ఇకపై ఎమ్మెల్యేలు, ఎంపీలకూ పదవులు ఇవ్వదలచుకోలేదని సీఎం స్పష్టంగా చెప్పారని తెలిపారు. 
 
అయితే, తితిదే ఛైర్మన్ కుర్చీపై ఆశపడటానికి ఓ కారణం ఉందన్నారు. తనకు మొదటి నుంచి దైవభక్తి ఎక్కువ.. చిన్ననాటి నుంచి టీటీడీ చైర్మన్ పదవి చేయాలని కోరిక ఉందని, అందుకే తన మనస్సులోని మాటను చంద్రబాబుకు చెప్పానని సినీ నటుడు వివరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments