Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆండ్రాయిడ్ ఫోన్ల'కు ఏజెంట్ స్మిత్ భయం

Webdunia
గురువారం, 11 జులై 2019 (17:28 IST)
ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగించే యూజర్లకు ఏజెంట్ స్మిత్ భయం పట్టుకుంది. ఏజెంట్ స్మిత్ అంటే ఇదో మొబైల్ మాల్‌వేర్ (హానికారక వైరస్). గతంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు.. భారత్‌ను గడగడలాడించిన ఈ వైరస్ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా 2.5 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడినట్టు చెక్ పాయింట్ అనే రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. వీటిలో సగానికిపైగా ఆండ్రాయిడ్ ఫోన్లు భారత్‌లో ఉన్నట్టు తెలిపింది.
 
యూజర్లకు తెలియకుండానే... వారి ఫోన్లలో ఉన్న మొబైల్‌ అప్లికేషన్ల స్థానంలో, వాటినే పోలిన హానికారక వెర్షన్లను ప్రవేశపెడుతున్నట్టు ఈ సంస్థ తెలిపింది. ఈ మాల్‌వేర్‌ ముఖ్యంగా హిందీ, అరబిక్, రష్యన్, ఇండోనేషియా భాషలు మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. 
 
నిజానికి ఈ తరహా మాల్‌వేర్ ఇప్పటివరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు... ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలలోని ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ఈ వైరస్ బారినపడినట్టు గుర్తించారు. ఇపుడు భారత్‌లో కోటిన్నర మంది ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ వైరస్ ఉన్నట్టు చెక్‌పాయింట్ సంస్థ వెల్లడించింది. అయితే, ఇదే విషయంపై గూగుల్‌ను సంప్రదించగా, ఈ తరహా వైరస్ యాప్ తమ ప్లే స్టోర్‌లో లేదని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments