Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో ఆడే ఆ ముగ్గురికి ప్రపంచ కప్‌లో ఛాన్స్? (video)

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (16:13 IST)
టీమిండియా జట్టుకు దూరంగా వున్న స్టార్ ప్లేయర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రహానేలు రానున్న వరల్డ్ కప్ పోటీల్లో బరిలోకి దిగుతారని మీడియాలో వార్తలొస్తున్నాయి ఈ ముగ్గురు టీమిండియా క్రికెట్ జట్టులో ఒకప్పుడు కీలక బాధ్యతలు చేపట్టారు. కానీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం ద్వారా జట్టుకు దూరమయ్యారు. 
 
అయితే.. ఐపీఎల్‌లో ఆడటం ద్వారా మళ్లీ ఈ ముగ్గురిని ప్రపంచ కప్‌లో ఆడే వన్డే జట్టులో స్థానం లభించే అవకాశం వుందని టాక్ వస్తోంది. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో వీరు ముగ్గురు మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తే.. బీసీసీఐ సెలక్టర్ల కన్ను వీరిపై పడుతుందని తద్వారా తప్పకుండా ఈ ముగ్గురు ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కించుకుంటారని క్రీడా పండితులు కూడా జోస్యం చెప్తున్నారు.
 
ఇందుకు కారణం లేకపోలేదు.. ఐపీఎల్ ఆడే క్రికెటర్లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సందేశం ఇచ్చాడు. ఐపీఎల్ క్రికెట్ ప్రతీ ఏడాది జరుగుతున్నాయి. ఇలానే ప్రపంచ కప్ పోటీలు ఐదేళ్లకు ఓసారి జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తు చేశాడు. 
 
ప్రపంచ కప్ గెలుచుకోవడం అనేది టీమిండియా ఆత్మగౌరవానికి సంబంధించిందని, అందుచేత ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లు వరల్డ్ కప్ పోటీలను దృష్టిలో పెట్టుకుని క్రికెట్ ఆడాలని పిలుపునిచ్చాడు. ఇంకా మానసికంగా, శారీరకంగా రాణించాలని.. ఫిట్‌నెస్ విషయంలో రాజీ పడకుండా.. గాయాలకు దూరంగా వుంటూ క్రికెట్ ఆడాలని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌లో మెరుగ్గా ఆడి.. పూర్తి ఫిట్‌నెస్‌ను కలిగివుండే క్రికెటర్లకు సెలక్టర్లు ఛాన్సిచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments