Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోచ్‌గా ఫ్లెమింగ్.. చెన్నైకి తప్ప మరో జట్టుకు ఆడనన్న ధోనీ

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ సీజన్‌ ఫీవర్ ప్రారంభమైంది. జనవరి 27, 28 తేదీల్లో ఈ ఏడాది ఐపీఎల్ ఆట‌గాళ్ల వేలం బెంగళూరులో జరగనుంది. ఈ నేపథ్యంలో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొని రెండు సంవత్సరాల నిషేధం

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (17:56 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ సీజన్‌ ఫీవర్ ప్రారంభమైంది. జనవరి 27, 28 తేదీల్లో ఈ ఏడాది ఐపీఎల్ ఆట‌గాళ్ల వేలం బెంగళూరులో జరగనుంది. ఈ నేపథ్యంలో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొని రెండు సంవత్సరాల నిషేధం తర్వాత ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనుంది. సీఎస్‌కే జట్టుకు గాను ఆ జట్టు యాజమాన్యం కోచ్‌ను ప్రకటించింది.
 
ఇందులో భాగంగా జట్టు ప్రధాన కోచ్‌ బాధ్యతలను న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్టీపెన్‌ ఫ్లెమింగ్‌, బ్యాటింగ్‌ కోచ్‌గా ఆసీస్‌ మాజీ ఆటగాడు మైకెల్ హస్సీ, బౌలింగ్‌ కోచ్‌గా భారత ఆటగాడు లక్ష్మిపతి బాలాజీ వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు సీఎస్‌కే నూతన చీఫ్‌ కాశీ ప్రకటించారు. గ‌తంలో కూడా ఫ్లెమింగ్ చెన్నై జ‌ట్టుకి కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి వచ్చిన చెన్నై టీమ్ యాజమాన్యం.. రిటెన్షన్ పాలసీలో ధోనీని తీసుకుంది. దీనిపై ధోనీ స్పందిస్తూ.. ఐపీఎల్‌లో చెన్నైకి తప్ప మరో జట్టుకు ఆడే ప్రసక్తే లేదన్నాడు. చెన్నై కాకుండా మరో టీమ్ గురించి ఆలోచించలేదని ధోనీ తెలిపాడు. చెన్నైకి తనకు రెండో ఇల్లు లాంటిదని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

ఢిల్లీ సీఎంపై దాడి ఘటనపై కేంద్రం సీరియస్ : జడ్ కేటగిరీ భద్రత

మద్యం కేసులో ఏపీ సర్కారు కీలక నిర్ణయం : రాజ్‌ కసిరెడ్డి ఆస్తుల జప్తు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

తర్వాతి కథనం
Show comments