Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరు మమ్మల్ని పదిసార్లు కొట్టారు. కానీ మేం ఒక్కసారే మిమ్మల్ని కొట్టాం.. అమితాబ్‌కి ఇంత పక్షపాతమా?

షోలే సినిమాతో జాతీయ హీరో అయిపోయిన సూపర్ స్టార్ అతడు. దశాబ్దంపాటు బాలీవుడ్‌నే కాదు యావత్ భారతదేశం అమితంగా ప్రేమించిన నటుడు అతను కానీ క్రికెట్ వంటి విషయాలకు వచ్చేసరికి ఇంత గొప్ప సూపర్ హీరో కూడా ఎంత సంకుచితంగా వ్యవహరిస్తాడో ఐపీఎల్ సాక్షిగా తెలుస్తోంది.

Advertiesment
IPL 10
హైదరాబాద్ , మంగళవారం, 23 మే 2017 (02:27 IST)
షోలే సినిమాతో జాతీయ హీరో అయిపోయిన సూపర్ స్టార్ అతడు. దశాబ్దంపాటు బాలీవుడ్‌నే కాదు యావత్ భారతదేశం అమితంగా ప్రేమించిన నటుడు అతను కానీ క్రికెట్ వంటి విషయాలకు వచ్చేసరికి ఇంత గొప్ప సూపర్ హీరో కూడా ఎంత సంకుచితంగా వ్యవహరిస్తాడో ఐపీఎల్ సాక్షిగా తెలుస్తోంది. అదృష్టవశాత్తూ పుణే సూపర్ జెయింట్‌పై ఒక్క రన్ తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు ఆదివారం రాత్రి ఉప్పల్‌లో  బతుకు జీవుడా అనే రీతిలో విజయం సాధిస్తే అదేదో పెద్ద ఫీట్ అయినట్లు ఊగిపోతూ అంత పెద్దాయన కూడా కసిని ప్రదర్శిస్తూ ఆ గెలుపుపై సంకుచిత ప్రకటన చేశారు. 
 
ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌. భారత క్రికెట్‌కు ‘బిగ్‌’ ఫ్యాన్‌. ఐపీఎల్‌లో మాత్రం ముంబై ఇండియన్స్‌ వీరాభిమాని. కానీ ఆదివారం ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ చేసిన స్కోరుతో తన అభిమాన జట్టు ఓడిపోతుందని నిరాశగా టీవీ కట్టేశారు. కానీ తన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఫోన్‌ చేసి ముంబై ఇండియన్స్ జట్టు గెలించిందనేసరికి ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు. ఆయనే బాలీవుడ్‌ ‘బిగ్‌–బి’ అమితాబ్‌ బచ్చన్‌.
 
ముంబై 20 ఓవర్లలో చేసిన 129 పరుగుల స్కోరు సీనియర్‌ బచ్చన్‌కు రుచించలేదు. అందుకే ఇన్నింగ్స్‌ బ్రేక్‌ తర్వాత కట్టేసిన టీవీవైపు మళ్లీ కన్నెత్తి చూడలేదు. కానీ అభిషేక్‌ బచ్చన్‌ సమాచారంతో సంతోషించిన ఆయన ట్విట్టర్‌లో ఆ అనుభూతిని డైలాగ్‌తో పంచుకున్నారు. ‘తుమ్‌ అపున్‌ కో దస్‌ మారా. అపున్‌ ఏక్‌ మారా... పర్‌ సాలిడ్‌ మారా’ (మీరు మమ్మల్ని పదిసార్లు కొట్టారు. కానీ మేం ఒక్కసారే మిమ్మల్ని కొట్టాం. అదరగొట్టాం) అని పోస్ట్‌ చేశారు అమితాబ్‌.
 
ఇంతటి పెద్దల్లోనే క్రికెట్ ప్రత్యేకించి ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో అమితాబ్ బచ్చన్ అంత పాక్షిక వ్యాఖ్య చేయడం చాలా అసందర్భంగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జట్టు గెలిచిందని టీవీ ముందు దుస్తులిప్పేసి గెంతులేసిన క్రికెటర్ ఎవరు?