Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య చెప్పింది నిజమైంది.. ధోనీ సూపర్ రికార్డ్..

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (09:53 IST)
గుజరాత్ టైటాన్స్‌తో ఐపీఎల్-16 ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 170 పరుగుల వరకు స్కోరు సాధిస్తుందని నందమూరి హీరో బాలకృష్ణ అంచనా వేశారు. ఈయన అంచనా వేసిన పరంగా జరిగింది. మ్యాచ్ ముగియగానే స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్ ప్రజెంటర్ వింధ్య విశాఖ ఈ విషయాన్ని బాలకృష్ణ వద్ద ప్రస్తావించింది. 
 
బాలయ్య చెప్పిందే నిజమైందని వింధ్య విశాఖ తెలిపింది. అందుకు సమాధానంగా బాలయ్య నుంచి చిరునవ్వు వెలువడింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 రాబోయే సీజన్ కోసం తమ కొత్త గీతాన్ని గుజరాత్ టైటాన్స్ (GT)తో తమ మొదటి మ్యాచ్‌కు ముందు ప్రారంభించిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో గత రాత్రి జరిగిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ధోనీ వయసు నిన్నటికి 41 సంవత్సరాల 267 రోజులు. 
 
ఐపీఎల్‌లో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్ రికార్డు ఇప్పటి వరకు దివంగత ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ పేరున ఉంది. వార్న్ 41 సంవత్సరాల 249 రోజుల వయసులో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు సారథ్యం వహించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో రైళ్లలోనే కాదు.. స్టేషన్‌లలో కూడా రద్దీనే రద్దీ

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

తర్వాతి కథనం
Show comments