Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ సలహాలకు అంత డిమాండ్ ఉందా.. స్మిత్ కూడా పడిపోయాడే..!

అంపైర్‌కు సిగ్నల్ ఇచ్చినందుకు కెరీర్‌లో తొలిసారిగా తీవ్ర మందలింపుకు గురైన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎంత గొప్ప ఆటగాడో, ఎంత గొప్ప వ్యూహ నిపుణుడో పదేళ్లుగా క్రికెట్ ప్రపంచం చూస్తూనే ఉంది. అతడి సలహాలు ఎంత అమూల్యమైనవో విరాట్ కోహ్లీని అడిగి

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (05:05 IST)
అంపైర్‌కు సిగ్నల్ ఇచ్చినందుకు కెరీర్‌లో తొలిసారిగా తీవ్ర మందలింపుకు గురైన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎంత గొప్ప ఆటగాడో, ఎంత గొప్ప వ్యూహ నిపుణుడో పదేళ్లుగా క్రికెట్ ప్రపంచం చూస్తూనే ఉంది. అతడి సలహాలు ఎంత అమూల్యమైనవో విరాట్ కోహ్లీని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆ విషయాన్ని తొలి మ్యాచ్‌లోనే గ్రహించేశాడు. ముంబై ఇండియన్ జట్టుతో తమ తొలి మ్యాచ్‌లో స్మిత్ అద్బుత బ్యాటింగ్‌తో తొలిబోణీ కొట్టిన విషయం తెలిసిందే కానీ అంత గొప్ప బ్యాట్స్‌మన్ కూడా ఎలాంటి అహం అన్నది లేకుండా పలుసార్లు మైదానంలో ధోనీతో మాట్లాడటం, సలహా తీసుకోవడం చాలామందిని కదిలించింది.
 
ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మైదానంలో ఉన్న స్మిత్ చాలా సార్లు ధోనీ దగ్గరికి వెళ్లి రావడం ప్రేక్షకులు గమనించారు. కానీ అలా దోనీని ఎందుకు కలుస్తున్నాడో ముందుగా అర్థం కాలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత పుణె ఆటగాడు అజింక్యా రహానే అసలు విషయం చెప్పేశాడు. ఐపీఎల్‌లో స్మిత్‌కి ఇది కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ కావడంతో ధోనీ నుంచి చాలా నేర్చుకున్నాడని, మ్యాచ్‌ మధ్యలో ధోనీతో చర్చించి సలహాలు తీసుకుని ఫీల్డింగ్‌లో మార్పులు చేశాడు అని రహానే తెలిపాడు. 
 
ఈ  ఇద్దరి కెప్టెన్లలో ఎవరు ఉత్తమం అని రహానేను అడగగా... స్మిత్‌ నాయకత్వంలో ఒక్క మ్యాచే ఆడానని, ధోనీ సారథ్యంలో ఎన్నో మ్యాచ్‌లు ఆడినట్లు చెప్పాడు. ధోనీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడు, ఆటగాడని రహానె కితాబిచ్చాడు. స్మిత్‌ సారథ్య బాధ్యతలను గొప్పగా నిర్వహించాడని అన్నాడు. అయితే ధోనీనే తన బెస్ట్‌ లీడర్‌ అని రహానె చెప్పాడు. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ సారథ్య బాధ్యతలు లేకుండా ధోనీ బరిలోకి దిగింది కూడా ఈ మ్యాచ్‌లోనే కావడం విశేషం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments