Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ కెరీర్‌లో ఇదే అతిపెద్ద తప్పా.. తీవ్రంగా మందలించిన మ్యాచ్ రిఫరీ

ఐపీఎల్ 10 సీజన్‌లో తొలిసారి సారధిగా కాకుండా మామూలు ప్లేయర్‌గా బరిలోకి దిగిన ధోనీ తన కెరీర్‌లోనే తొలిసారిగా తీవ్ర మందలింపును ఎదుర్కొన్నాడు. గురువారం ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ సమయంలో కెప్టెన్‌కాకున్నా అప్పీలు చేసి అంపైర్ నిర్ణయాన్ని తప్పు పడుతూ ధ

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (02:26 IST)
సరదా కోసం కూడా ఆట మధ్యలో అంపైర్లతో ఆటాడుకోవద్దని భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీకి కాస్త ఆలస్యంగా తత్వం బోధపడింది. ఈ మధ్య రెండేళ్ల క్రితం టెస్ట్ జట్టు కెప్టెన్సీని, ఈమధ్యనే వన్డే జట్టు కెప్టెన్సీని కోహ్లీకి వదులుకున్న ధోనీ అటు ఐపీఎల్ ప్రాంచైజ్ రైజింగ్ సన్ పుణె జట్టు కెప్టెన్సీని కూడా చేజార్చుకున్నాడు. తాజాగా ఐపీఎల్ 10 సీజన్‌లో తొలిసారి సారధిగా కాకుండా మామూలు ప్లేయర్‌గా బరిలోకి దిగిన ధోనీ తన కెరీర్‌లోనే తొలిసారిగా తీవ్ర మందలింపును ఎదుర్కొన్నాడు. గురువారం ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ సమయంలో కెప్టెన్‌కాకున్నా అప్పీలు చేసి అంపైర్ నిర్ణయాన్ని తప్పు పడుతూ ధోనీ చేసిన సంజ్ఞ అతడిని అడ్డంగా ఇరికించేసింది.
 
ముంబయి ఇండియన్స్‌ జట్టు 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసిన సమయంలో పుణె స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ 15వ ఓవర్‌ వేయడానికి సిద్ధమయ్యాడు. తాహిర్‌ వేసిన బంతి ముంబయి బ్యాట్స్‌మన్‌ పొలార్డ్‌ ప్యాడ్‌లకు తాకడంతో అతడు ఔట్‌ కోసం అంపైర్‌ను అప్పీల్‌ కోరాడు. కీపింగ్‌ చేస్తున్న ధోని సైతం గట్టిగానే అప్పీల్‌ చేసినప్పటికీ అంపైర్‌ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. ధోనీ వెంటనే సమీక్ష కోరాడు. 
 
ఇక్కడే ధోనీ పప్పులో కాలేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ల్లో ప్రస్తుతం టెస్టు, వన్డే ఫార్మాట్లో మాత్రమే ‘డీఆర్‌ఎస్‌’ను ఉపయోగిస్తున్నారన్న విషయం మర్చిపోయాడో, లేత ఉద్దేశపూర్వకంగా అలా చేశాడో కానీ, పరోక్షంగా అంపైర్‌ నిర్ణయాన్ని అసహనంతో వ్యంగ్యంగా సంజ్ఞ రూపంలో తెలియజేశాడు. ఈ పరిణామంతో తోటిఆటగాళ్లు, మ్యాచ్‌ చూస్తోన్న ప్రేక్షకులు షాక్ తిన్నారు. మిస్టర్ కూల్‌గా ప్రపంచ క్రికెట్‌లో చలించని ప్రమాణాలు సృష్టించిన ధోనీ ఇలా అంపర్ నిర్ణయాన్ని ప్రశ్నించడం, తనదైన శైలిలో నిరసన ప్రదర్శించడం పెద్ద చర్చకు దారితీసింది.
 
అంపైర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా ధోని వ్యవహరించడం ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే. అతని ప్రవర్తనా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉండటంతో లెవల్‌–1 నిబంధనల ప్రకారం అతన్ని తీవ్రంగా మందలించారు. నియమావళిలో లెవల్‌–1 నేరం కిందకు వస్తుండటంతో మ్యాచ్‌ రిఫరీ మనూ నాయర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ధోనీ తాను కెప్టెన్‌ అన్న సంగతి మరిచి ఇలా చేశాడో.. కావాలనే చేశాడో అన్న విషయం మాత్రం ఇప్పటికీ అర్థం కావడం లేదు. సాధారణ జట్టు సభ్యుడిగా ధోనీకి ఇది తొలిమ్యాచ్‌ కావడం వల్ల.. పాత అలవాటు ప్రకారం అలా చేసి ఉంటాడని చాలామంది ధోనికి మద్దతుగా నిలుస్తున్నారు.
 
ఎవరు మద్దతుగా నిలిచినా, తప్పు తప్పే కాబట్టి ధోనీ మ్యాచ్ రెఫరీ నుంచి తీవ్ర మందలింపునే ఎదుర్కొన్నాడు.
 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments