స్వదేశంలో ఐపీఎల్ : పూర్తి షెడ్యూల్‌ విడుదల

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (15:03 IST)
కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత సీజన్ ఐపీఎల్ పోటీలను యూఏఈ గడ్డపై నిర్వహించిన బీసీసీఐ తాజా సీజన్‌ను స్వదేశంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం పూర్తి షెడ్యూల్ విడదల చేసింది. ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే ఐపీఎల్ 14వ సీజన్ మే 30న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. 
 
చెన్నైలో జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఇక, ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా అవతరించిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ మ్యాచ్‌కు వేదికగా నిలవనుంది. ఈ భారీ స్టేడియంలో ఐపీఎల్ పోటీలు జరగడం ఇదే తొలిసారి.
 
కాగా, కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని 6 వేదికల్లోనే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా, లీగ్ దశ పోటీలకు ప్రేక్షకులను అనుమతించకుండా, ప్లే ఆఫ్ దశ నుంచి మైదానాలకు ప్రేక్షకులను అనుమతిస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. భవిష్యత్తుపై స్పెషల్ రిపోర్ట్!

భర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తాహసీల్దార్ భార్య (వీడియో)

బంగ్లాదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం - 6 గంటలకే దుకాణాలు బంద్

టీఆర్ఎస్ అనే పేరు పబ్లిక్ డొమైన్‌లో వుంది.. కవిత పార్టీ పేరు అదేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త కోణంలో ఇచట లవ్ అమ్మబడును కొనబడును చిత్రం రివ్యూ

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

Samaira: కామాఖ్య నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ సఖీ సాంగ్ రిలీజ్

Adi Sai Kumar: ఆది సాయి కుమార్ కొత్త చిత్రం టైటిల్ సైరాబాను

తర్వాతి కథనం
Show comments