Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020 : ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన బెన్ స్టోక్.. రాయల్‌గా రాయల్స్

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2020 (09:14 IST)
యూఏఈ గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ పోటీల్లో ఆదివారం రాత్రి 45వ మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ముంబై జట్టు నిర్ధేశించిన భారీ విజయలక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ 37, సూర్యకుమార్ యాదవ్ 40, సౌరభ్ తివారీ 34 పరుగులు చేయగా, మ్యాచ్ ఆఖర్లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. వేసిన బంతులను వేసినట్టే స్టాండ్స్‌లోకి తరలించాడు. 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పాండ్యా 2 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 60 పరుగులు చేశాడు.
 
ఆ తర్వాత 196 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు ఏ దశలోనూ తడబడలేదు. ఫలితంగా 196 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 10 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది.
 
జట్టు ఆటగాళ్లు రాబిన్ ఉతప్ప (13), స్టీవ్ స్మిత్ (11) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరినప్పటికీ బెన్ స్టోక్స్, సంజు శాంసన్ కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. స్టోక్స్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 
 
60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయ సెంచరీ (107) చేశాడు. మరోవైపు సంజు శాంసన్ కూడా ముంబై బౌలర్ల భరతం పట్టాడు. 31 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 54 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి 18.2 ఓవర్లలోనే జట్టును విజయ తీరాలకు చేర్చారు. 
 
అజేయ సెంచరీతో రాజస్థాన్‌కు అపురూప విజయాన్ని అందించిన స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో రాజస్థాన్‌కు పెద్దగా ఒరిగిందేమీ లేనప్పటికీ ముంబై ఇండియన్స్‌ను ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టకుండా ప్రస్తుతానికి అడ్డుకుంది. 
 
రాజస్థాన్‌కు ఇది ఐదో విజయం కాగా, ముంబైకి ఇది నాలుగో ఓటమి. నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా జట్ల మధ్య షార్జాలో ఐపీఎల్‌ 46వ మ్యాచ్ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అఘోరీని వదిలి వెళ్లడం ఇష్టం లేదన్న యువతి.. తీసుకెళ్లిన తల్లిదండ్రులు (video)

కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఎమ్మెల్యే! (Video)

కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా - ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారు... షర్మిల

తెలంగాణలో అకాల వర్షాలు.. భారీగా పంట నష్టం.. ఐదుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments