Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హమ్మయ్య... చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచిందోచ్...

Advertiesment
హమ్మయ్య... చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచిందోచ్...
, ఆదివారం, 25 అక్టోబరు 2020 (21:49 IST)
ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా, ఓటములను అలవాటుగా చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎట్టకేలకు మరో గెలుపును నమోదు చేసుకుంది. ఇప్పటివరకు పేలవమైన ప్రదర్శనతో వరుస ఓటములను ఎదుర్కొంటూ వచ్చిన ధోనీ సేన... ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఎట్టకేలకు ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
నిజానికి ఈ సీజన్‌లో సీఎస్కే జట్టు పేలవమైన ప్రదర్శనతో రాణిస్తోంది. ఫలితంగా ఈ జట్టు ఆడిన తొలి పది మ్యాచ్‌లలో ఏకంగా ఏడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. ఫలితంగా ప్లే ఆఫ్స్ ఆశలను కోల్పోయింది. 
 
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చెన్నై ఓ విజయాన్ని సాధించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. చెన్నై జట్టులో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ 65 (51 బంతులు), అంబటి రాయుడు 39 (27 బంతులు), డుప్లెసిస్ 25 (13 బంతులు), ధోనీ 19 పరుగులు చేశారు. గైక్వాడ్, ధోనీ ఇద్దరూ నాటౌట్‌గా నిలిచారు. 
 
అంతకుముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 43 బంతుల్లో ఒక ఫోరు‌, ఒకి సిక్స్ సాయంతో 1సిక్స్ సాయంతో 50 రన్స్ చేయగా, డివిలియర్స్‌ 36 బంతుల్లో 4 ఫోర్లు బాది 39 పరుగులు చేశాడు. ఫలితంగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. 
 
మ్యాచ్ ఆరంభంలో దేవదత్‌ పడిక్కల్‌(22) ఫర్వాలేదనిపించినా.. టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్లు నిరాశపరిచారు. ఫలితంగా తక్కువ స్కోరు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే బౌలర్లలో శామ్‌ కరణ్‌(3/19), దీపక్‌ చాహర్‌(2/31) కట్టుదిట్టంగా బంతులేసి బెంగళూరు భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. 
 
ఆ తర్వాత 146 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే జట్టు మరో ఎనిమిది బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడులు రాణించడంతో ఆ జట్టుకు సునాయాసమైన విజయం లభించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోలుకున్న హర్యానా హరికేన్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్