Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔట్ అంటే ఔటే... అది క్యాచ్ అయినా.. ఎల్బీడబ్ల్యూ అయినా? ధోనీ వైఫ్ ట్వీట్.. (video)

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:05 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సాక్షి ధోనీ ఓ ట్వీట్ చేసింది. ఐపీఎల్ 2020 టోర్నీలో దొర్లుతున్న ఫీల్డ్ అంపైర్ తప్పిదాలను విమర్శిస్తూ ఆమె చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. నిజానికి ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికి దాన్ని ఆమె డిలీట్ చేసింది. కానీ, అది అప్పటికే వైరల్ అయింది. తన ట్వీట్‌లో ఆమె అంపైర్ల తీరును ఎండగట్టారు. అంతేకాకుండా ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో అంపైరింగ్ మరింత నాణ్యవంతంగా ఉండాలంటూ అభిప్రాయపడ్డారు. 
 
ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నాలుగో లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఆటగాడు టామ్‌ కరన్‌ను ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌‌గా ప్రకటించారు. ఆ తర్వాత ఫీల్డ్ అంపైర్లు ఇద్దరూ సమీక్షించుకొని థర్డ్ అంపైర్‌‌కు నివేదించారు. థర్డ్ అంపైర్ నిశితంగా పరిశీలించి కరన్‌ను నాటౌట్‌‌గా ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ జట్టు భారీ స్కోరు చేసింది. 
 
దీనిపై ఇన్‌‌స్టాగ్రామ్, ట్విట్టర్‌‌లలో స్పందించిన సాక్షి ధోనీ... సాంకేతికతనే వాడాలనుకుంటే సరిగ్గా వాడాలని అభిప్రాయపడింది. "ఔట్‌ అంటే ఔటే. అది క్యాచ్‌ అయినా ఎల్బీడబ్ల్యూ అయినా? ఔటిచ్చాక తిరిగి మూడో అంపైర్‌కు నివేదించడాన్ని తొలిసారి చూస్తున్నా" అని పేర్కొంది. 
 
కోట్ల మంది వీక్షించే ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో అంపైరింగ్‌ మరింత నాణ్యంగా ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పోస్ట్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే వాటిని ఆమె తొలగించడం గమనార్హం. పంజాబ్ కింగ్స్ లెవెన్ మ్యాచ్‌లో కూడా ఫీల్డ్ అంపైర్ ఓ రన్ కట్ చేయడంతో ఆ మ్యాచ్‌లో ఆ జట్టు ఓడిపోయిన విషయం తెల్సిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments