Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేఎల్ రాహుల్ అదుర్స్- బెంగ‌ళూరుపై కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ ఘన విజయం..

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (10:31 IST)
దుబాయ్ వేదిక‌గా గురువారం జ‌రిగిన ఐపీఎల్ 6వ మ్యాచ్‌లో రాయ‌ల్స్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ ఘ‌న విజ‌యం సాధించింది. బెంగ‌ళూరుపై పంజాబ్ 97 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొందింది. పంజాబ్ నిర్దేశించిన 207 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో బెంగ‌ళూరు బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోయారు. దీంతో పంజాబ్ సునాయాసంగా విజ‌యం సాధించింది.
 
మ్యాచ్‌లో రాయల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా పంజాబ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పంజాబ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 206 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ (132 ప‌రుగులు నాటౌట్‌, 14 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) అద్భుతంగా రాణించాడు. దీంతో పంజాబ్ టీం బెంగ‌ళూరు ఎదుట భారీ ల‌క్ష్యాన్ని ఉంచ‌గ‌లిగింది. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో శివం దూబెకు 2 వికెట్లు ద‌క్క‌గా, చాహ‌ల్ 1 వికెట్ తీశాడు.
 
అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన బెంగ‌ళూరు ఆరంభంలోనే త‌డ‌బ‌డింది. వికెట్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కోల్పోతూ వ‌చ్చింది. దీంతో ఆ జ‌ట్టు 17 ఓవ‌ర్ల‌కే ఆలౌట్ అయింది. 109 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. పంజాబ్ చేతిలో బెంగ‌ళూరు దారుణంగా ఓడిపోయింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో ర‌వి బిష్ణోయ్‌, ఎం అశ్విన్‌ల‌కు చెరో 3 వికెట్లు ద‌క్క‌గా, షెల్డాన్ కాట్రెల్ 2 వికెట్లు తీశాడు. ష‌మీ, మాక్స్‌వెల్‌లు చెరొక వికెట్ తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

ప్రారంభమైన నాగ చైతన్య - శోభిత వివాహ వేడుకలు - వైభవంగా హల్దీ వేడుకలు

తర్వాతి కథనం
Show comments