Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఏఈ వేదికగా సెప్టెంబరులో ఐపీఎల్ - 51 రోజుల పాటు కాసుల పోటీలు

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (09:21 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్2020) పోటీలు వచ్చే సెప్టెంబరు నుంచి యూఏఈ వేదికగా ప్రారంభంకానున్నాయి. నిజానికి ఇదే నెలలో ఐసీసీ నిర్వహించే ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు జరగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ భయం కారణంగా ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వాల్సిన క్రికెట్ ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. దీంతో ఈ పోటీలను ఐసీసీ వచ్చే యేడాదికి వాయిదావేసింది. దీంతో ఐపీఎల్ పోటీల నిర్వహణకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. 
 
ఈ పోటీల నిర్వహణకు దేశంలో ఈ యేడాది ఆఖరు వరకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా ఉండబోవని బీసీసీఐ భావిస్తోంది. దీంతో పోటీలను యూఏఈలో జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 మధ్య ఈ పోటీలు జరిగే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
 
ఈ విషయమై అన్ని ఫ్రాంచైజీలకూ బీసీసీఐ నుంచి సమాచారం వెళ్లిందని, పోటీల నిర్వహణపై వారి సలహాలు, సూచనలు కూడా తీసుకోనున్నామని ఓ అధికారి వెల్లడించారు. పోటీలు 51 రోజుల పాటు సాగుతాయి కాబట్టి, ప్రసార హక్కులను పొందిన కంపెనీలు, ఇతర వాటాదారులకు సైతం ఎటువంటి అభ్యంతరాలూ ఉండబోవని భావిస్తున్నట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
 
వాస్తవానికి సెప్టెంబర్ 26 నుంచి ఈ పోటీలను ప్రారంభిస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, ఐపీఎల్ ముగియగానే, ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్ జట్టు వెళ్లాల్సి వుండటం, ఆ దేశ ప్రభుత్వ నిబంధనల మేరకు ఆసీస్ వెళ్లిన ఆటగాళ్లంతా 14 రోజుల క్వారంటైన్ పాటించడం తప్పనిసరి కావడంతో, ఓ వారం ముందుగానే ఐపీఎల్‌ను ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

తర్వాతి కథనం
Show comments