Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020... చెన్నై-ముంబైల మధ్య తొలి మ్యాచ్.. వ్యూవర్ షిప్ అదిరిపొద్ది..!

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (12:42 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ధోనీ, రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఐపీఎల్‌ను అత్యధికులు వీక్షించనున్నారని.. ఐపీఎల్ ఛైర్మన్ ప్రిజేష్ పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
యూఏఈ నుంచి ప్రిజేష్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా అనేక అడ్డంకులను దాటుకుని ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుందన్నారు. ఈ సిరీస్‌ సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. అత్యధిక మంది వీక్షకులు ఈ షోను తిలకించనున్నారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్సుకు కరోనా కాలంలో ఐపీఎల్ 13వ సీజన్ మంచి వినోదాన్ని పంచనుందన్నారు. 
 
బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకుల కఠోర శ్రమతో ఈ సీజన్ జరగనుందని.. కరోనా వైరస్ కారణంగా ఈ షో జరుగుతుందా లేదా అనే అనుమానం తలెత్తిందని చెప్పుకొచ్చారు.  కరోనాపై పోరాటం చేస్తూనే ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
 
ఇకపోతే.. ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు అబుదాబి, దుబాయ్, షార్జాల్లో జరుగనున్నాయి. దుబాయ్‌లో 24 మ్యాచ్‌లు, అబుదాబిలో 20 మ్యాచ్‌లు, షార్జాలో 12 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రతీ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. రెండు మ్యాచ్‍లు జరిగేటప్పుడు తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

తర్వాతి కథనం
Show comments