Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్సీబీకి అందని ద్రాక్షలా ఐపీఎల్ టైటిల్ - ఈసారైనా కల నెరవేరేనా?

Advertiesment
IPL 2020
, బుధవారం, 16 సెప్టెంబరు 2020 (14:35 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఒకటి. ఐపీఎల్ సీజన్ మొదలైందంటే.. బెంగుళూరు అభిమానుల హడావుడి అంతఇంతాకాదు. ఈ దఫా కప్పు మనదేనంటూ నానా హంగామా చేస్తారు. ఐపీఎల్ టైటిల్ కోసం గత 12 యేళ్లుగా పోరాటం చేస్తోంది. మూడు సార్లు ఫైనల్‌కు చేరింది. కానీ, ఒక్కసారంటే ఒక్కసారి కూడా టైటిల్‌ను కైవసం చేసుకోలేక పోయింది. అందుకే ఈ దఫా అయినా ఆర్సీబీ కల నెరవేరాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
 
నిజానికి ఆర్సీబీ జట్టు పేపర్‌పై పులిలా కనిపిస్తోంది. బంతికే భయం పుట్టేలా బాదగల విరాట్ కోహ్లీ, సిక్సర్లకు కొత్త అర్థం చెప్పిన డివిలియర్స్, విధ్వంసానికి కేరాఫ్‌ అడ్రస్‌‌గా మారిన అరోన్ ఫించ్, పిట్టకొంచెం కూత ఘనంలా చెలరేగే పార్థివ్ పటేల్, నిఖార్సయిన ఆల్‌రౌండర్స్‌ మొయిన్‌ అలీ, మోరిస్, పేస్‌ గన్స్‌ స్టెయిన్‌, ఉమేశ్‌, సిరాజ్, స్పిన్‌ మాంత్రికులు జంపా, చాహల్‌ ఇలా మెరికల్లాంటి క్రికెటర్లతో ఆర్సీబీని మించిన జట్టు మరొకటి ఉండదు. అయినా పుష్కర కాలంగా ఐపీఎల్‌ టైటిల్‌ కోసం అలుపెరగని పోరాటం చేస్తూనేవుంది. 
 
ఈ యేడాది ఐపీఎల్ 2020 టోర్నీ యూఏఈ వేదికగా జరుగనుంది. ఇందుకోసం ఆర్బీసీ కూడా సిద్ధమైంది. బ్యాటింగ్‌తో పోల్చుకుంటే బౌలింగ్‌ కాస్త బలహీనంగా ఉండటంతో రూ.10 కోట్లు వెచ్చించి దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ను కొనుగోలు చేసింది. 12 యేళ్లుగా పోరాడుతున్నా.. ఒకటికి మూడుసార్లు (2009, 2011, 2016) ఫైనల్‌ చేరినా.. టైటిల్‌ మాత్రం కొట్టలేకపోయిన రాయల్‌ చాలెంజర్స్‌.. ఈ సారి మరింత జోరు పెంచేందుకు సిద్ధంగా ఉంది.
webdunia
 
2016 సీజన్‌లాగే ఇప్పుడు కూడా జట్టు చాలా సమతూకంగా ఉందని విరాట్‌ సంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. డివిలియర్స్‌ కూడా ఫుల్‌ జోష్‌లో కెప్టెన్‌కు అండగా నిలుస్తున్నాడు. భీకర బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న బెంగళూరు నిలకడగా ఆడితే ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. 
 
ఇకపోతే, ఐపీఎల్‌ చర్రితలో ఇప్పటివరకు ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడు విరాట్‌ కోహ్లీనే. బెంగళూరు అభిమానులు అతడిని ఆదరించే తీరు చూసి.. ఎప్పటికీ తాను చాలెంజర్స్‌ను వీడకపోవచ్చని విరాట్‌ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అలా తనపై నమ్మకం పెట్టుకున్న అభిమానుల కోసం శాయశక్తుల కష్టపడుతున్న కోహ్లీ.. ఈ సారి టైటిల్‌ లోటు భర్తీ చేయాలని తహతహలాడుతున్నాడు. 
 
ఐపీఎల్ లీగ్‌లో ఆర్సీబీ మొత్తం 181 మ్యాచ్‌లు ఆడితే, 84 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 98 మ్యాచ్‌లలో ఓడిపోయింది. నాలుగు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. 2009, 2011 సంవత్సరాల్లో ఈ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఫలితంగా రన్నరప్‌గా మిగిలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త జెర్సీల్లో మెరిసిపోతున్న చెన్నై సూపర్ కింగ్స్...