Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2020 : పరాగ్ సిక్సర్‌తో రాయల్స్ విజయం.. హైదరాబాద్‌కు భంగపాటు!

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (21:02 IST)
ఐపీఎల్ టోర్నీలోభాగంగా, ఆదివారం మధ్యాహ్నం జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఆ జట్టు ఆటగాడు పరాగ్ భారీ సిక్సర్‌తో జట్టును గెలిపించాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భంగపాటు తప్పదలేదు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో రాజస్థాన్ జట్టు 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఆటగాళ్లు క్యాచ్‌లు వదలడం రాయల్స్‌కు లాభించింది. 
 
రాజస్థాన్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బెన్‌స్టోక్స్‌(5), జోస్‌ బట్లర్‌(16), స్టీవ్‌ స్మిత్‌(5), శాంసన్‌(26), రాబిన్‌ ఉతప్ప(18) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ దశలో క్రీజులో ఉన్న పరాగ్ - తెవాటియా జోడీ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో చెలరేగారు. 
 
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న పరాగ్, తెవాటియా భారీ షాట్లతో సన్ రైజర్స్ అవకాశాలకు తెరదించారు. పరాగ్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేయగా, తెవాటియా 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేశాడు.
 
ముఖ్యంగా చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు కావాల్సి ఉండగా, ఆ ఓవర్ ఐదో బంతికి పరాగ్ సిక్స్ కొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం ఖాయమైంది. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్‌ను ఓడించింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు.
 
అంతకుముందు మనీశ్‌ పాండే 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో (53 రన్స్) అద్భుత అర్థ సెంచరీకి తోడు డేవిడ్‌ వార్నర్‌ 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు 48 పరుగులతో) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (22నాటౌట్‌: 12 బంతుల్లో 2సిక్సర్లు) విజృంభించడంతో సన్‌రైజర్స్‌ సాధారణ స్కోరు చేయగలిగింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, కార్తీక్‌ త్యాగీ, ఉనద్కత్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments