యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగడం.. రీసెంట్‌గా ప్రారంభం కావడం తెలిసిందే. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఆగింది.
అదేంటి రెండు రోజుల క్రితమే కదా స్టార్ట్ చేసారు అప్పుడే ఆగిపోవడం ఏంటి అనుకుంటున్నారా? అవును.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ నిజంగానే ఆగింది. అయితే... రెండు మూడు రోజుల్లో మళ్లీ స్టార్ట్ చేసినా.. తాజా షెడ్యూల్లో ఎన్టీఆర్ కానీ చరణ్ కానీ పాల్గొనరని తెలిసింది.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ అనేది డైలీ సీరియల్లా అలా సాగుతూనే ఉంది. చరణ్ పాత్రకు సంబంధించి వీడియో రిలీజ్ చేసారు. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి వీడియో రిలీజ్ చేయాలి. దీని కోసం జక్కన్న కసరత్తు చేస్తున్నారు.
అయితే... ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరడం లేదు. దీంతో 2021 సమ్మర్‌కి రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ.. షూటింగ్ జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే.. 2021 సమ్మర్ తర్వాత అయినా రిలీజ్ అవుతుందా..? ఇంకా బాగా ఆలస్యం అవుతుదా..? అనే అనుమానాలు వస్తున్నాయి.
ఇలా షూటింగ్ ఆలస్యంగా జరిగే కొద్దీ జక్కన్న పై మరింత ఒత్తిడి పెరగడం ఖాయం. అందుకనే జక్కన్న ఇక నుంచి ఎలాంటి బ్రేక్‌లు లేకుండా షూటింగ్ చేయాలి అనుకుంటున్నారట. షూటింగ్ కోసం పక్కా ప్లాన్ రెడీ చేసారని సమాచారం. మరి.. రిలీజ్ డేట్ పైన క్లారిటీ ఎప్పుడు ఇస్తారో..?