Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ కిక్ అంటే అదే మరి.. అందుకే ప్రపంచంలో ఐపీఎల్ బెస్ట్ లీగ్

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:12 IST)
ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగ్‌లు ఉన్నాయి. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ అంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా గమనిస్తూ వుంటుంది. ప్రతి ఒక్క క్రికెటర్ ఐపీఎల్ ఆడితే చాలు అని అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా కొన్ని మ్యాచ్‌లు కూడా ఎంతో రసవత్తరంగా సాగుతూ ఉంటాయి. పంజాబ్‌, రాజస్థాన్ మ్యాచ్‌ కూడా అలాంటిదే. 
 
షార్జా స్టేడియంలో అసలైన సిక్సర్ల వర్షాన్ని చూశారు. మరో 3 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ఇదో అద్భుత మ్యాచ్ అని, అందుకే ప్రపంచంలో ఐపీఎల్ బెస్ట్ లీగ్ అని ఆయన తన ట్విట్టర్‌లో తెలిపారు. 
 
రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్ ఎన్నో ట్విస్టులతో సాగిన సంగతి తెలిసిందే. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ మ్యాచ్‌ను ఊహించని స్థాయిలో ముగించేసిందని గంగూలీ గుర్తు చేశారు. 
 
ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ మొత్తం 34 ఫోర్లు, 29 సిక్సర్లు బాదారు. పంజాబ్ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ 107 పరుగులు చేయగా.. రాజస్థాన్ జట్టులో స్మిత్‌, తెవాటియా, శాంసన్‌లు హాఫ్ సెంచరీలతో విజయానికి బాటలు వేశారు. రాహుల్ తెవాటియా ఇన్నింగ్స్ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

తర్వాతి కథనం
Show comments