Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ Vs ఢిల్లీ క్యాపిటల్స్.. అగ్రస్థానానానికి ఢిల్లీ.. హైలైట్స్.. రికార్డులివే..

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (14:34 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్... రాజస్థాన్ రాయల్స్‌పై గెలుపును నమోదు చేసుకుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మరోమారు ఢిల్లీ కేపిటల్స్ జట్టు 12 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 148 పరుగులకే చేతులెత్తేసింది.
 
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అద్భుతమైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక అర్ధశతకాలు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. బుధవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 30 బంతిలో హాఫ్ సెంచరీ చేసిన ధావన్‌కు ఇది ఐపీఎల్‌లో 39వ హాఫ్ సెంచరీ. దీనికంటే ముందు ధావన్ విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రోహిత్ శర్మలతో 38 అర్థశతకాలు చేసిన భారత ఆటగాడిగా వారితో సమానంగా ఉన్నాడు.
 
అయితే ఈ మ్యాచ్ కంటే ముందు మ్యాచ్ ముంబై ఇండియన్స్‌‌పై 52 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేసాడు ధావన్. కానీ అందులో చాలా నెమ్మదిగా ఆడటంతో అతనిపై విమర్శలు వచ్చాయి. కానీ ఈ మ్యాచ్‌లో ధావన్ కేవలం 30 బంతుల్లోనే 50 పరుగులు చేసాడు. ఇక ధావన్‌కు ఐపీఎల్ టోర్నీలో ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
 
అలాగే ఐపీఎల్‌ 2020లో దక్షిణాఫ్రికా పేసర్ నోర్జే అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా సఫారీ పేసర్ అన్రిచ్ నోర్జే నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన తన సహచరుడు డెల్ స్టెయిన్ ఫాస్టెస్ట్ రికార్డును అధిగమించడంతో మరో రెండు ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ నోర్జే.
 
బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్రిచ్ నోర్జే గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా నోర్జే నిలిచాడు. ఆ మరుసటి బంతికే రాజస్థాన్ ఓపెనర్ జాస్ బట్లర్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. 
 
అంతేగాకుండా ఐపీఎల్‌లో రెండో, మూడో వేగవంతమైన బంతులు బౌలింగ్ చేసిన బౌలర్‌గానూ ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 155.2 కి.మీ/గంటకు, 154.7 కి.మీ/గంటకు వేగంగా బంతులను సంధించి ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన బంతులు సంధించి, ఒకే మ్యాచ్‌లో బౌర్ నోర్జే ఈ ఘనత సాధించాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 13 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. నోర్జే 4-0-33-2 గణాంకాలతో రాణించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments