Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నెగెటివ్ ఫలితంతో దీపక్ చాహర్‌కు లైన్ క్లియర్...

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (16:37 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓ శుభవార్త. ఆ జట్టు సభ్యుల్లో యువ క్రికెటర్ దీపక్ చాహర్ కరోనా వైరస్ బారినపడ్డాడు. దీంతో అతన్ని సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంచారు. ఈ క్రమంలో ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది. దీంతో దీపక్ త్వరలోనే జట్టు సభ్యులతో కలుస్తాడని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తమ జట్టు సభ్యుడు దీపక్ చాహర్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలిందని, అందువల్ల త్వరలోనే జట్టుతో కలిసి మైదానంలో ప్రాక్టీస్ చేస్తాడని తెలిపారు. 
 
కేవలం సీఎస్‌కే వైపు నుంచి మాత్రమే కాకుండా బీసీసీఐ వైద్య బృందం నుంచి కూడా చాహర్‌కు క్లియరెన్స్‌ లభించిందని, మైదానంలో ప్రాక్టీస్‌ చేయడానికి అతడు సిద్ధంగా ఉన్నాడని విశ్వనాథన్‌ వెల్లడించారు.
 
సీఎస్‌కే, బీసీసీఐ వైపు నుంచి దీపక్‌కు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయని, శుక్రవారం నుంచి శిక్షణ ప్రారంభిస్తాడని ఆయన చెప్పారు.  మరో విదేశీ ప్లేయర్‌ డేవిడ్‌ మలన్‌(ఇంగ్లాండ్‌)ను జట్టులోకి తీసుకోవాలని సీఎస్‌కే యోచిస్తున్నదా? అనే ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 
 
తమ జట్టులో విదేశీ కోటా జాబితా ఫుల్‌గా ఉందన్నారు. అందువల్ల మరో విదేశీయుడిని ఎలా తీసుకుంటామో నాకైతె తెలియదని, మా జట్టులో ఏ విదేశీ ఆటగాడు కూడా గాయ పడలేదని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments