Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో యాంకరింగ్ చేయనున్న తెలుగు పిల్ల..(video)

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (15:27 IST)
బీసీసీకు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ అంచె పోటీలు ఈ నెల 19వ తేదీ నుంచి దుబాయ్ వేదికగా జరుగనున్నాయి. ఈ టోర్నీ కోసం మొత్తం 8 ఫ్రాంచైజీలు ఇప్పటికే యూఏఈకి చేరుకుని ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. అంతేకాకుండా, ఐపీఎల్ ఏర్పాట్లను పరిశీలించేందుకు కూడా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా దుబాయ్‌కు వెళ్లారు. అయితే, ఈ ఐపీఎల్‌లో తెలుగు అమ్మాయి యాంకరింగ్ చేయనుంది. ఆమె పేరు నేహా. బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఇపుడు ఐపీఎల్ 2020లో యాంకరింగ్ చేయనుంది. కొంతకాలంగా తెలుగులోనూ వ్యాఖ్యానం వినిపిస్తున్న ఐపీఎల్ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ తెలుగు బృందంలో నేహాకు కూడా చోటుదక్కింది.
 
ఈ విషయం తెలిసిన టాలీవుడ్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు యాంకర్ నేహాకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. శుక్రవారం నేహా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. "నేహా చౌదరీ... జిమ్నాస్టిక్స్‌లో ఎన్నో మెడల్స్ సాధించావు. రాబోయే ఐపీఎల్‌తో నీ యాంకరింగ్ ద్వారా తెలుగు వారందరికీ మరింత దగ్గరవ్వాలని ఆశీర్వదిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
 
కాగా, నేహా చౌదరి రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ కూడా. అయితే వినోద రంగంపై ఆసక్తితో ఆమె యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి కొద్దికాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆమె ప్రతిభకు తగ్గట్టుగానే కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ స్వాగతం పలికింది. 
 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments