Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020: ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (10:41 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ముంబై ఇండియన్స్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను.. 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని.. ఈజీగా ఛేదించిన రోహిత్‌ సేన.. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
 
149 పరుగుల లక్ష్యంతో ఇన్సింగ్‌ ప్రారంభించిన ముంబైకి.. రోహిత్‌, డికాక్‌లు మంచి ఆరంభాన్నిచ్చారు. 35 పరుగులతో రోహిత్‌.. అర్ధశతకంతో డికాక్‌.. జట్టు విజయానికి బాటలు వేశారు. రోహిత్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ కూడా వెంటనే వెనుదిరగడంతో... మరో వికెట్‌ పడకుండా హర్దిక్‌ పాండ్యాతో కలిసి పని ముగించాడు డికాక్‌. మరో 19 బాల్స్‌ ఉండగానే ముంబైకి విజయాన్ని అందించారు.
 
అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా.. 61 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 53 పరుగులు చేసిన కమిన్స్‌, 39 రన్స్‌ చేసిన కొత్త కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ కోల్‌కతాను ఆదుకున్నారు. 
 
ఆరో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రత్యర్థి ముందు గౌరవప్రదమైన స్కోరును ఉంచారు. చివరి వరకు క్రీజులో ఉన్న మోర్గాన్.. ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టాడు. ముంబయి బౌలరల్లో రాహుల్ చాహర్ రెండు వికెట్లు.. బౌల్ట్, కౌటర్‌నైల్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments