Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ క్యాపిటల్ బౌలర్ ఎన్రిచ్ నోర్జ్ సరికొత్త రికార్డు .. ఏంటది?

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (15:35 IST)
యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు విజయభేరీ మోగించింది. ఇందులో ఢిల్లీ జట్టు బౌలర్ ఎన్రిస్ నోర్జె సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలరుగా తన పేరును చరిత్రపుటల్లో లిఖించుకున్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో ఎన్రిచ్ నోర్జె గంటకు 156.22 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. ఇప్పటివరకు ఏ ఒక్క ఐపీఎల్ బౌలర్ ఇంత వేగంతో బంతిని విసిరిన దాఖలాలు లేవు. అయితే, 26 యేళ్ళ నోర్జె విసిరిన బంతిని రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాట్స్‌మెన్ మన్‌జోస్ బట్లర్ అంతే వేగంతో బౌడరికీ తరలించాడు. ఆ తర్వాత బంతిని నోర్జె గంటకు 155.21 కిలోమీటర్ల వేగంతో సంధించగా, ఈసారి జోస్ బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 
 
మొత్తమ్మీద రెండు వరుస బంతులను 150 కిమీ పైచిలుకు వేగంతో విసరడం ద్వారా ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఫాస్టెస్ బాల్ వేసిన రికార్డు దక్షిణాఫ్రికాకే చెందిన డేల్ స్టెయిన్ పేరిట ఉంది. 2012 సీజన్‌లో స్టెయిన్ వేసిన ఓ బంతి గంటకు 154.40 కిమీ వేగంతో దూసుకెళ్లింది. 
 
ఇక, బుధవారం నాటి మ్యాచ్‌లో తాను అత్యంత వేగవంతమైన బంతి విసిరిన సంగతి నోర్జెకు మ్యాచ్ అయిపోయే వరకు తెలియదట. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన ఈ సఫారీ స్పీడ్‌స్టర్ ఇప్పటివరకు 6 టెస్టులాడి 19 వికెట్లు సాధించాడు. 7 వన్డేల్లో 14 వికెట్లు, 3 టీ20 అంతర్జాతీయ పోటీల్లో 2 వికెట్లు పడగొట్టాడు. 
 
కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ 30వ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 8 వికెట్లు కోల్పోయి 148కే చతికిలపడి ఓటమి పాలైంది.
 
నిజానికి తొలుత లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపించినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు పారేసుకోవడంతో ఓటమిని కొనితెచ్చుకుంది. మరోవైపు, ఢిల్లీ బౌలర్లు తుషార్ దేశ్‌పాండే, అన్రిక్‌, రవిచంద్రన్ అశ్విన్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

తర్వాతి కథనం
Show comments