Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు రూ.12 లక్షల అపరాధం.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (10:10 IST)
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు 12 లక్షల రూపాయల అపరాధం విధించారు. దీనికి కారణం స్లో ఓవర్ రేట్. ఐపీఎల్ టోర్నీలో భాగంగా, మంగళవారం రాత్రి అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో 11వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిని చవిచూసింది. హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్ స్పిన్ బౌలింగ్ ధాటికి ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. 
 
దీనికితోడు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు ఐపీఎల్ రూ.12 లక్షల జరిమానా విధించింది. కనీస ఓవర్ రేట్ తప్పిదం కారణంగా ఐపీఎల్ నియమావళి కింద అయ్యర్‌కు జరిమానా విధించినట్టు పేర్కొంది. స్లో ఓవర్ రేట్‌కు ఈ సీజన్‌లో జరిమానా ఎదుర్కొన్న రెండో జట్టు జట్టు ఢిల్లీనే. ఇటీవల బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఇదే తరహా అపరాధం విధించిన విషయం తెల్సిందే. 
 
హైదరాబాద్ వికెట్లు పడగొట్టేందుకు ఢిల్లీ కెప్టెన్ అయిన శ్రేయాస్ బౌలింగ్‌లో పలు మార్పులు చేశాడు. బౌలర్లతో చర్చలు జరిపాడు. ఈ క్రమంలో నిర్దేశిత సమయంలో బౌలింగ్ కోటాను జట్టు పూర్తి చేయలేకపోయింది. దీంతో ఐపీఎల్ నియమావళి కింద జరిమానా విధించారు. కాగా, హైదరాబాద్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఢిల్లీ తొలి ఓటమిని నమోదు చేసింది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments