Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తుగా ఓడిన చెన్నై... ఐపీఎల్ హిస్టరీలో తొలి ఆటగాడు మహీ! (Video)

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (09:39 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లేఆఫ్ దశకు దూరమైంది. పైగా, ఆ జట్టుకు మిగిలిన నాలుగు మ్యాచ్‌లు నామమాత్రంగా మారాయి. ఇదిలావుంటే, జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. 
 
 


 
ఈ మ్యాచ్‌లో మహీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై తరపున ఆడుతున్న ధోనీ.. ఐపీఎల్‌ చరిత్రలో 4 వేల పరుగులు మార్క్‌ చేరుకున్నాడు. 2008 సీజన్‌ ఆరంభం నుంచి రెండేండ్లు మినహా ధోనీ చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకే టీమ్‌ తరపున 4 వేల పరుగులు సాధించి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
అంతేకాకుండా, ఐపీఎల్‌లో ఇప్పటివరకు 200 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4596కిపైగా పరుగులు పూర్తి చేశాడు. అందులో 23 అర్థశతకాలు ఉన్నాయి. లీగ్‌లో అత్యధిక స్కోరు 84. అలాగే, ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్‌ (197), రైనా (193), కార్తీక్‌ (191), కోహ్లీ (186) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూత

Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Driver: మైనర్ బాలికపై అత్యాచారం- డ్రైవర్‌కు పదేళ్ల జైలు శిక్ష

స్నేహితుడి సలహా మేరకు మర్మాంగాన్ని కోసుకున్నాడు.. ఎక్కడ?

Woman: చికెన్ వండలేదని భార్యను హత్య చేశాడు.. దుప్పటిలో చుట్టి గంగానదిలో పారేశాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్షవర్ధన్ షాహాజీ షిండే- కొత్తదారులు చూపుతున్న యువ పారిశ్రామికవేత్త

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

తర్వాతి కథనం
Show comments