Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020 : సూపర్ థ్రిల్లర్ .. పంజాబ్ బోల్తా... ఢిల్లీ గెలుపు

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:23 IST)
ఐపీఎల్ రెండో మ్యాచ్‌లోనే అసలైన మజా కనిపించింది. నమ్మకంగా గెలుస్తుందని భావించిన పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు గెలుపు ముంగిట బోల్తా పడింది. ఖచ్చితంగా ఓడిపోతుందని భావించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎవరూ ఊహించని విధంగా సూపర్ డూపర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 
 
ఐపీఎల్ 13వ సీజన్ పోటీల్లో భాగంగా ఆదివారం అబుదాబి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ - కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. 
 
క్రీజులోకి వచ్చిన ఢిల్లీ ఆటగాళ్లు పంజాబ్ బౌలర్ల దెబ్బకు విలవిల్లాడారు. క్రీజులో కుదురుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. నాలుగు ఓవర్లలో 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడిన జట్టును కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్‌లు ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి నెమ్మదిగా ఆడుతూ క్రీజులో నిలదొక్కుకున్నారు.
 
అయితే, ఐపీఎల్‌లో అందరూ ఊహించే భారీ హిట్టింగులు లేకపోవడంతో మ్యాచ్ చప్పగా సాగుతున్నట్టు అనిపించింది. ఈ క్రమంలో వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాదిన అయ్యర్ జోష్ నింపే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ వెంటనే పంత్, అయ్యర్ వెంటవెంటనే అవుటవడంతో ఇక ఢిల్లీ పనైపోయిందనుకున్నారు. పంత్ 29 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేయగా, అయ్యర్ 32 బంతుల్లో మూడు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. అప్పటికి స్కోరు 14.1 ఓవర్లలో 87 మాత్రమే.
 
అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 21 బంతుల్లో 3 సిక్సర్లు, 7 ఫోర్లతో 53 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి పుణ్యమా అని జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి ప్రత్యర్థి ఎదుట ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీసుకోగా, కార్టెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్ ఓ వికెట్ తీసుకున్నాడు.
 
ఆ తర్వాత 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు బ్యాటింగ్ కూడా పడుతూ సాగింది. 21 పరుగులు చేసిన రాహుల్ ఔటయ్యాక వరుసపెట్టి వికెట్లను కోల్పోతూ పరాజయం దిశగా సాగుతున్నట్టు కనిపించింది. అయితే, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ క్రీజులో పాతుకుపోయి చివర్లో చెలరేగిపోయాడు. 60 బంతుల్లో 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 89 పరుగులు చేసి జట్టును విజయం వైపు నడిపించాడు. 
 
మ్యాచ్ ఆఖరి ఓవర్లలో 13 పరుగులు అవసరం కాగా, 3 బంతుల్లో 12 పరుగులు వచ్చాయి. ఇక విజయానికి ఒకే ఒక్క పరుగు అవసరమైన తరుణంలో డ్రామా మొదలైంది. చివరి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన పంజాబ్ రెండు వికెట్లు చేజార్చుకుంది. చివరి బంతికి మయాంక్ ఔట్ కావడంతో పంజాబ్ జట్టు కథ ముగిసింది. మ్యాచ్ టైగా ముగిసింది.
 
మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ అవసరం అయింది. ఈ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ రబడ బౌలింగ్‌లో రెండు పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ కేపిటల్స్ రెండు బంతుల్లోనే మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్టోయినిస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments