మళ్లీ విమర్శిస్తే చంపేస్తా.. ఆర్‌సీబీ అభిమాని హెచ్చరిక..

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (17:52 IST)
ఐపీఎల్-12లో రాయల్ ఛాలెంజర్స్‌ పేలవ ప్రదర్శనతో అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. జట్టు వరుస పరాజయాలతో ఆర్‌సీబీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. మరికొందరు అయితే ఏకంగా కెప్టెన్‌ను మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆర్సీబీ ఆటతీరుపై న్యూజిలాండ్‌ బౌలర్‌, ప్రముఖ కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ విమర్శలు చేసాడు. 
 
తాజాగా ఓ డై హార్డ్ ఆర్సీబీ ఫ్యాన్ ఆ కమెంట్‌లను తట్టుకోలేక ఆర్సీబీని విమర్శిస్తే చంపుతానని హెచ్చరిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసాడు. "ఇతరుల గురించి మాట్లాడే ముందు ఆలోచించాలి. రాయల్ ఛాలెంజర్స్ వారి పరాజయాన్ని అంగీకరించారు. మళ్లీ ఎప్పుడూ అలాంటి కామెంట్స్ చేయకని, కాదని మళ్ళీ విమర్శించావో చచ్చిపోతావు జాగ్రత్త" అంటూ హెచ్చరించాడు.
 
ఆ అభిమాని పోస్ట్‌పై సైమన్‌ డౌల్‌ స్పందించాడు. ‘ఇది ఒక ఆట మాత్రమే. చిల్‌ ఔట్‌ బ్రో’ అంటూ ట్విటర్‌లో సమాధానం ఇచ్చాడు. ఇలా చాలా మంది నుంచి విమర్శలు రావడంతో సైమన్‌ డౌల్‌కు ఆర్సీబీపై చేసిన విమర్శల పోస్టును తొలిగించారు. ప్రస్తుతం బెంగళూరు ఆడిన నాలుగు మ్యాచ్‌లు ఓటమి చెందడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments