Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నుదుట బొట్టు బిళ్లల ప్యాకెట్‌నూ వదలని చౌకీదార్ మోడీ...

Advertiesment
Bindi Packet
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:39 IST)
"నేను మీ చౌకీదారుని" అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు. ఇటీవల రైళ్ళలో టీ కప్పులపై కూడా మైబీ చౌకీదార్ అనే నినాదంతో బీజేపీ ప్రచారానికి తెరలేపింది. ఇంకొందరు బీజేపీ అభిమానులు పెళ్లి శుభలేఖలను కూడా బీజేపీ ప్రచారాస్త్రంగా ఉపయోగించారు. 
 
మాపెళ్లికి మీరు గిఫ్టులు ఇవ్వొద్దు కానీ మోడీకి ఓటేయ్యండని కోరిన సంఘటనను కూడా మనం చూసాం. మరోవైపు చీరలపై మోడీ బొమ్మలను కూడా ముద్రిస్తూ వాటిని విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మహిళా ఓటర్లను ఆకర్షించడానికి నుదుట పెట్టుకునే బొట్టు బిళ్లల ప్యాకెట్‌పై ఏకంగా మోడీ బొమ్మను ముద్రించారు.
 
 
పరాస్ ఫ్యాన్సీ బిందీ అనే కంపెనీ విడుదల చేసిన బొట్ట బిళ్లల ప్యాకెట్‌పై ఒకవైపు నరేంద్రమోడీ, మరోవైపు బీజేపీ కమలం గుర్తు ముద్రించి ఉన్నాయి. పైభాగంలో హిందీలో ఫిర్ సే మోదీ సర్కార్ (మరోసారి మోడీ ప్రభుత్వం) అని రాసి ఉంది. ఈ ఫోటోలను పశ్చమ బెంగాల్  రాయ్‌గంజ్ నియోజకవర్గ ఎంపీ అయిన సలీం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 
 
పేటీఎం బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు పరాస్ ఫ్యాన్సీ బిందీలకు ముఖచిత్రంగా మారిపోయారని ఎండీ సలీమ్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు నిజంగా కంపెనీ ముద్రించిందా లేక ఇంకెవరైనా అనధికార వ్యక్తులెవరైనా ముద్రించారా అన్నది తేలాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాన్‌తో ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగింపు