Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాన్‌తో ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగింపు

Advertiesment
PAN
పాన్ కార్డ్ నంబర్‌తో ఆధార్ నంబర్‌ను లింక్ చేయమని ప్రభుత్వం కోరుతోంది. వీటిని లింక్ చేసుకునేందుకు మార్చి 31వ తేదీని గడువు తేదీగా నిర్ణయించింది. అయితే గడువుతేదీ పూర్తయినప్పటికీ చాలా మంది అనుసంధానం చేసుకోలేదు. ఈ అనుసంధాన ప్రక్రియకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం గడువును పొడిగించింది.
 
వీటి అనుసంధానానికి గడువు ఇంతకుముందు ప్రకటించిన ప్రకారం మార్చి 31తో ముగియగా, తాజాగా మరో ఆరు నెలలపాటు ఆ గడువును పొడిగించింది. సెప్టెంబర్ 30లోపు వినియోగదారులు పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. 
 
ఇకపై ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసేవారు తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌ను కూడా  పొందుపరచాలని సూచించింది. ఈ నిబంధన ఏప్రిల్ 1 ,2019 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఆధార్ రాజ్యాంగ బద్దమేనని, ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేవారు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌ను పొందుపరచాలని గతేడాది సెప్టెంబర్‌‌లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛీ..ఛీ జీవిత రాజశేఖర్‌లకు సిగ్గుందా? స్నేక్ బాబుకి రాడ్ దింపారుగా: శ్రీరెడ్డి