Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫీల్డింగ్‌లో చాణక్యుడు.. సారథ్యంలో శ్రీకృష్ణుడు.. ఎవరు? (వీడియో)

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (15:31 IST)
టీమిండియాకు ఆయన మాజీ కెప్టెన్. అయినా కూల్ కెప్టెన్. మహీ అంటే కుర్రకారులో ఓ ఉత్సాహం. అతని హెలికాప్టర్ షాట్ అంటే గంతులేసే ఫ్యాన్స్. ఫీల్డింగ్‌లో చాణక్యుడు. క్రికెట్‌లో రాజనీతి ప్రదర్శించేవాడు. ఇతని సారథ్యంలో టీమిండియా వన్డేతో పాటు ట్వంటీ-20 ప్రపంచ కప్‌లను గెలుచుకుంది. సంప్రదాయ టెస్టు, పరిమిత ఓవర్లైన వన్డే, పొట్టి ఓవర్లైన టీ-20 ఫార్మాట్‌లలో ధోనీ రికార్డుల పంట పండించాడు. 
 
ఇది చాలదన్నట్లు.. కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ తనకంటూ ఓ టీమ్.. తనకంటూ వున్న సారథ్యాన్ని ఏర్పరుచుకున్నాడు. కెప్టెన్‌గానే కాకుండా మంచి ఆటగాడిగా దేశ వ్యాప్తంగానే కాకుండా చెన్నై ఫ్యాన్స్‌కు బాగా నచ్చేశాడు. ప్రపంచ వ్యాప్తంగానూ ధోనీకి ఫ్యాన్స్ వున్న సంగతి తెలిసిందే. కానీ ఐపీఎల్ ద్వారా మహీకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 
 
విజిల్ పోడు, ఎల్లో ఆర్మీ పేరిట ధోనీకి వున్న ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో భారీగా షేక్ చేస్తున్నారు. నాలుగు పదులు మీద పడినా బ్యాటింగ్‌లో తడబడినా ఫీల్డింగ్‌ ద్వారా తనకంటూ ఓ స్థానాన్ని జట్టులో పదిలం చేసుకుంటూ.. యువ క్రికెటర్లకు సలహాలిస్తూ... వారిని ఎంకరేజ్ చేస్తూ.. సారథ్యంలో శ్రీకృష్ణుడిగా, వికెట్ కీపింగ్‌లో, చాణక్యుడిగా సత్తా చాటుతున్నాడు. 
 
తాజాగా ఐపీఎల్‌లో ధోనీ సారథ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో వుంది. ఇందుకు చెన్నై కింగ్స్ సాధించిన విజయాలే కారణం. ధోనీ చరిష్మాను ఐపీఎల్ ఆర్గనైజర్లు ఉపయోగించుకున్నారు. ఐపీఎల్ గ్రాండ్ సక్సెస్ అయ్యేందుకు చెన్నై సూపర్ కింగ్స్  కూడా ఓ కారణమనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ జట్టుకు సారథి ధోనీ కావడమే. 
 
తద్వారా ఐపీఎల్‌కు ధోనీ ట్రేడ్ మార్కుగా నిలిచాడనే చెప్పాలి. మైదానంలో ధీటుగా రాణించే క్రికెటర్లను ఎంచుకుని.. వారి స్టార్‌డమ్‌ను ఐపీఎల్ నిర్వాహకులు బాగా వాడుకుంటున్నారు. ఇలా ధోనీని కూడా ఐపీఎల్ నిర్వాహకులు చెన్నై కోసం బరిలోకి దించి సక్సెస్ అయ్యారు. 
 
ఇక ధోనీ ఐపీఎల్ చరిత్రలో సక్సెస్ ఫుల్ క్రికెటర్. ఆల్ రౌండర్‌గా ధోనీ ఐపీఎల్‌లో మాస్ మహారాజుగా నిలిచాడు. అత్యుత్తమ వికెట్ కీపర్, కెప్టెన్‌గా ఐపీఎల్ టీ-20కి పర్‌ఫెక్ట్ ప్యాకేజ్‌గా కనిపిస్తున్నాడు.. ఈ రాంచీ రాక్ స్టార్. ఇతని పేరిట ఐపీఎల్‌లో రికార్డులు మస్తుగా వున్నాడు. అవేంటో చూద్దాం..
 
ఐపీఎల్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిగా, వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అతని పేరిట రికార్డులు వున్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు రాబట్టిన కెప్టెన్‌గా ధోనీ రికార్డు సాధించాడు.
 
2019 ఐపీఎల్‌లో ధోనీ రికార్డుల సంగతికి వస్తే..  
ఐపీఎల్‌లో 175 మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. 40.16 యావరేజ్, 138.19 స్ట్రైక్ రేటుతో 4,016 పరుగులు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మూడు సీజన్లలో (2010, 2011, 2018) ధోనీ జట్టుకు విజయం సాధించి పెట్టాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపింగ్‌లో ధోనీనీ టాప్... ఇంకా సక్సెస్‌ఫుల్ ప్లేయర్. 
 
ఐపీఎల్ అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో ధోనీ 4,016 పరుగులతో ఏడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో చెన్నై కింగ్స్ క్రికెట్ సభ్యుడు సురేష్ రైనా (175 మ్యాచ్‌ల్లో 4,985 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా ధోనీ నిలిచాడు. 186 సిక్సులతో మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్ గేల్ 292 సిక్సులతో అగ్రస్థానంలో వుండగా, 187 సిక్సులు సాధించిన ఏబీ డివిలియర్స్‌తో ధోనీ 186 సిక్సులతో రెండో స్థానానికి పోటీ పడుతున్నాడు. 
 
ఇంకా అత్యుత్తమ వికెట్ కీపర్‌గా ఐపీఎల్‌లో ధోనీ పేరిట రికార్డు వుంది. 83 క్యాచ్‌లు 33 స్టంపింగ్ డిస్మిసల్స్‌తో మొత్తం 116 డిస్మిసల్స్‌తో పాయింట్ల పట్టికలో ధోనీ రెండో స్థానంలో వున్నాడు. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ తరపున అత్యధిక సిక్సులు సాధించిన రెండో క్రికెటర్‌గానూ ధోనీ నిలిచాడు. 186 సిక్సులతో ధోనీ చెన్నై ఆటగాళ్లలో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. 
 
ఐపీఎల్ 12వ సీజన్‌లో ఇటీవల రాజస్థాన్‌పై విజయం సాధించిన చెన్నై వంద మ్యాచుల్లో విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. మొత్తం 166 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సరిగ్గా వంద విజయాలు నమోదు చేసింది. అంతేకాదు, ఐపీఎల్‌లో వంద మ్యాచులు గెలిచిన జట్టుకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా ధోనీ పేరు రికార్డుల్లోకి ఎక్కింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

తర్వాతి కథనం
Show comments