ఏం జాదవ్... ఈసారి ఇంటికెళ్లిపోతావా? ధోనీ ప్రశ్న.. పడిపడి నవ్విన టీమ్మెట్స్

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (16:44 IST)
ప్రస్తుతం స్వదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ దశ పోటీలు జరుగుతున్నాయి. శనివారం నుంచి ప్రారంభమైన ఈ పోటీల్లో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో తలపడింది ఈ మ్యాచ్‌లో సీఎస్కే విజయభేరీ మోగించింది. 
 
అయితే, ఈ మ్యాచ్ అనంతరం జట్టు సహచరులను కెప్టెన్ ధోనీ ఆటపట్టించాడు. ముఖ్యంగా, బౌలర్ కేదార్ జాదవ్‌ను ఆపట్టించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిచిన సమయంలో కేదార్ జాదవ్ క్రీజులో ఉన్నాడు. ఈ విజయం నీకెలా అనిపిస్తోందంటూ టీమ్ మేట్ మోహిత్ చౌహాన్.. జాదవ్‌ను ప్రశ్నించాడు. 
 
దీనిపై అతడు స్పందిస్తూ, చాలా సంతోషంగా ఉంది. గతేడాది ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనూ ముంబైపై గెలిచినప్పుడు నేనే క్రీజులో ఉన్నాను. ఇప్పుడూ అదే జరిగింది అని చెబుతూ పోయాడు. మధ్యలో జోక్యం చేసుకున్న ధోనీ.. మరి ఈసారీ ఇంటికెళ్లిపోతావా అంటూ ప్రశ్నించాడు. 
 
ధోనీ ఇలా అడగటానికి కారణం లేకపోలేదు. గతేడాది ఆ మ్యాచ్ తర్వాత గాయంతో కేదార్ జాదవ్ సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు. దీంతో ఈసారీ అలాగే చేస్తావా అంటూ ధోనీ సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో పక్కనే ఉన్న టీమ్ మేట్స్ అంతా పెద్దగా నవ్వారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. 
 
సాధారణంగా ఒక జట్టు కెప్టెన్‌గా ధోనీ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. కానీ, మ్యాచ్ అనంతరం జట్టు సహచరులతో ఎంతో సరదాగా గడుపుతాడు. జట్టులో సీనియర్ మోస్ట్ ప్లేయర్ అయినా కూడా తన కంటే జూనియర్ ప్లేయర్స్‌ను ఆట పట్టిస్తాడు. తాజాగా చెన్నై, బెంగళూరు మ్యాచ్ తర్వాత కూడా తన టీమ్ ప్లేయర్ కేదార్ జాదవ్‌ను ఆట పట్టించాడు. చెన్నై విమానాశ్రయంలో ఈ సరదా ఘటన చోటు చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments