Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2017 : కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ ఉత్కంఠ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2017 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ జట్టు ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకుంది. యువ బ్యాట్స్‌మెన్‌ నితీష్‌ రాణా (29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2017 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ జట్టు ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకుంది. యువ బ్యాట్స్‌మెన్‌ నితీష్‌ రాణా (29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50), హార్దిక్‌ పాండ్యా (11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 నాటౌట్‌) వీరోచిత బ్యాటింగ్‌తో రాణించడంతో ముంబై ఇండియన్స్ ఈ టోర్నీలో తొలి విజయన్ని నమోదు చేసుకుంది.
 
సొంతగడ్డపై ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై 4 వికెట్లతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చిత్తు చేసింది. కోల్‌కతా నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలుండగా ఛేదించింది. 16.1 ఓవర్లలో 119/5 స్కోరుతో ఓటమి అంచుల్లో నిలిచిన దశ నుంచి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నితీష్‌, హార్దిక్‌ అసాధారణ పోరాటంతో ముంబై అద్భుత విజయాన్ని అందుకుంది. 
 
తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతాకు ఓపెనర్లు గౌతమ్‌ గంభీర్‌ (19), క్రిస్‌ లిన్‌ (32) తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 178 పరుగులు చేసింది. 
 
అనంతరం ముంబై ఇండియన్స్ ఛేదనలో ఓపెనర్లు పార్థివ్‌ పటేల్‌ (27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 30), జోస్‌ బట్లర్‌ (22 బంతుల్లో ఫోర్‌, 2 సిక్సర్లతో 28) ధాటిగా ఆడడంతో ముంబై ఓ దశలో 65/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ, ఓపెనర్లతో పాటు కెప్టెన్‌ రోహిత్ (2) వరుస ఓవర్లలో అవుటవడంతో ఒక్కసారిగా 74/3తో కష్టాల్లో పడింది. చివరకు ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments