Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2017 : సత్తాచాటిన రషీద్‌, భువీ.. హైదరాబాద్ సన్‌రైజర్స్‌ రెండో విక్టరీ

ఐపీఎల్ పదో అంచె పోటీల్లో భాగంగా హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు మరోమారు అదరగొట్టింది. ఫలితంగా సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 10 టోర్నీ ప్రారంభమ్యాచ్‌లో ఈ జట్టు అద్

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (11:03 IST)
ఐపీఎల్ పదో అంచె పోటీల్లో భాగంగా హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు మరోమారు అదరగొట్టింది. ఫలితంగా సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 10 టోర్నీ ప్రారంభమ్యాచ్‌లో ఈ జట్టు అద్భుత బోణీ కొట్టిన విషయం తెల్సిందే. 
 
ఆదివారం జరిగిన ఆ జట్టు రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ లయన్స్‌ను చిత్తు చేసింది. ఆల్‌రౌండ్‌ షోతో రషీద్‌ ఖాన్‌ స్పిన్‌ మాయాజాలం.. మిగతా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జాసన్‌ రాయ్‌, మెకల్లమ్‌, రైనా, ఫించ్‌, దినేశ్‌ కార్తీక్‌, డ్వేన్‌ స్మిత్‌ వంటి స్టార్‌ ప్లేయర్లతో దుర్భేద్యమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న గుజరాత్‌ను 135 పరుగులకే కట్టడి చేసింది.
 
ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం సాయంత్రం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొమ్మిది వికెట్లతో లయన్స్‌ను చిత్తు చేసింది. గుజరాత్‌ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని ఒకే వికెట్‌ కోల్పోయి మరో 27 బంతులు మిగిలుండగానే ఛేదించింది. డేవిడ్‌ వార్నర్‌ (45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 నాటౌట్‌), మోసీ హెన్రిక్స్‌ (39 బంతుల్లో 6 ఫోర్లతో 52 నాటౌట్‌) ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టుకు ఘన విజయం కట్టబెట్టారు. 
 
అంతకుముందు రషీద్‌ ఖాన్‌ (3/19), భువనేశ్వర్‌ కుమార్‌ (2/21) బౌలింగ్‌ ధాటికి.. గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసింది. డ్వేన్‌ స్మిత్‌ (27 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37), దినేష్‌ కార్తిక్‌ (30), జాసన్‌ రాయ్‌ (21 బంతుల్లో 5 ఫోర్లతో 31) మినహా మిగతావారంతా పూర్తిగా విఫలమయ్యారు. జట్టులో ఐదుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆశీష్‌ నెహ్రా ఒక వికెట్‌ పడగొట్టాడు. రషీద్‌ ఖాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లభించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పేడెక్స్ మిషన్: భారత్‌కు ఈ ప్రయోగం ఎందుకంత కీలకం?

గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కాంట్రాక్టర్ల వ్యవస్థను జగన్ చంపేశారు : ఆర్థిక మంత్రి పయ్యావుల

అరే... పేర్ని నాని నీ బ్యాటరీ సరిగ్గా లేదు... పవన్ మంచోడు కాబట్టే.. : జేసీ ప్రభాకర్ రెడ్డి (Video)

తూగోలో రేవ్ కలకలం... ఐదుగురు అమ్మాయిలతో 14 మంది పురుషుల పార్టీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్.. పూల వర్షం.. వండర్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ అవార్డ్స్ (video)

Akkineni Nageswara Rao: స్మరించుకున్న మోదీ.. నాగార్జున, శోభిత, చైతూ ధన్యవాదాలు

అబ్బాయిగా, అమ్మాయిగా నటిస్తున్న విశ్వక్సేన్.. లైలా

డ్రింకర్ సాయి మూవీ డైరెక్టర్‌ కిరణ్‌ తిరుమలశెట్టిపై దాడి

పవన్ కళ్యాణ్ ఓకే అంటేనే ఏపీలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్

తర్వాతి కథనం
Show comments