Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని అడిగితే తప్పులేదు కదా... సుబ్రహ్మణ్యపురం నటి ఈషా రెబ్బ(Video)

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (21:24 IST)
‘‘సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్’’ పతాకంపై బీరం సుధాకర రెడ్డి నిర్మించిన ‘‘సుబ్రహ్మణ్యపురం’’. సెన్సిబుల్ హీరో సుమంత్, ఈషారెబ్బ జంటగా నటించిన ఈ మూవీతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డిసెంబర్ 7న (శుక్రవారం) ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈషా రెబ్బ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
 
దర్శకుడు సంతోష్ కథ చెప్పగానే ఏమనిపించింది?
నాకు సంతోష్ రెండు గంటలు కథ చెప్పాడు.. అతను కథ చెపుతున్నప్పుడు నేను విజువలైజ్ చేసుకున్నాను అది నాకు బాగా నచ్చింది. అందుకే ఓకే చెప్పాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని రకాల సినిమాలు చూస్తాను. కానీ నెక్ట్స్ ఏమవుతుంది అని టెన్షన్ పడుతూ సినిమాలు చూడటం నాకు ఇష్టం. ఆ ఎలిమెంట్స్ సుబ్రహ్యణ్యపురంలో చాలా ఉన్నాయి.
 
 
మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఊరంటే చాలా ఇష్టపడే అమ్మాయి, తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అందులోనూ తండ్రిని ఎక్కువుగా ఇష్టపడుతుంది. ఇంకా చాలా భక్తురాలు, కానీ ఈ సినిమాలో కనిపించేంత భక్తురాలను కాదు. ఇందులో లవ్ స్టోరీ ఉంటుంది కానీ అది థ్రిల్లర్ ఎక్స్పీరయన్స్‌ని డిస్ట్రర్బ్ చేయదు. 
 
సుబ్రహ్మణ్యపురం టీం గురించి?
ఈ టీంతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఆర్.కె. ప్రతాప్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ సుబ్రహ్మణ్యపురంకు పెద్ద అసెట్‌గా నిలిచాయి. దర్శకుడు సంతోష్ మొదటి సినిమా అయినా అన్ని క్రాప్ట్‌ల నుండి బెస్ట్ అవుట్‌పుట్‌ని తీసుకున్నాడు. అతను కథను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. 
 
షూట్ చేసినప్పుడు ఎలా ఫీలయ్యారు?
షూట్ చేస్తున్నప్పుడు అంత భయం అనిపించలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆ టోటాలిటీ వస్తుంది. అది చాలా ఎఫెక్ట్‌గా ఉంటుంది. 
 
సుమంత్‌ రోల్ ఎలా వుంటుంది?
నేను భక్తురాలుగా కనిపిస్తాను. సుమంత్ కంప్లీట్ అపోజిట్ రోల్ ప్లే చేసాడు. వారి అభిప్రాయాల మద్య ఘర్షణ ఉంటుంది. దేవుడు ఉన్నాడని నమ్మే అమ్మాయికి, దేవుడుపై రిసెర్చ్ చేసే అబ్బాయికి మధ్య లవ్ ఫీల్ ఎలా కలిగింది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. 
 
 
సుమంత్‌తో వర్క్ చేయడం..?
సుమంత్ సినిమాలలో గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీ రావా సినిమాలు నాకు ఇష్టం. ఆయన నటన సహజంగా ఉంటుంది అది నాకు నచ్చుతుంది. షూటింగ్ అంతా చాలా బాగా జరిగింది. 
 
కొత్తవాళ్లను అడుగుతున్నారనీ...?
నాకు వచ్చిన కథలలో నాకు నచ్చినవి ఎంచుకుంటున్నాను. ఒక పాత్రకు నేను ఉంటే బాగుంటుంది అనుకునే పాత్రలను చేస్తున్నాను. నాకు కొత్త దర్శకులతో, కొత్త కాంబినేషన్స్‌లో వర్క్ చేయాలని ఉంటుంది. నేను అలాంటి పాత్రలు కోసం అప్రోచ్ అవుతాను, పని అడగటంలో తప్పు లేదు కదా.. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. 
 
 
నిర్మాత గురించి...
నిర్మాత అంటే ఓన్లీ బడ్జట్‌లోనే ఇన్వాల్వ్ అవుతారు అనుకుంటారు. కానీ సుధాకర రెడ్డి గారు సినిమా కథ చర్చలలో కూడా పాల్గోనేవారు, రోజూ షూట్‌కి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకునే వారు. సుబ్రహ్మణ్యపురం అవుట్‌పుట్ ఇంత ఎఫెక్టివ్‌గా రావడానికి ఆయన ఇచ్చిన సపోర్ట్ కారణం. 
 
దర్శకుడి గురించి...
సంతోష్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. అతను బౌండ్ స్ర్కిప్ట్‌తో వచ్చాడు. ప్రతి సీన్ అతను వివరించే విధానం చాలా క్లారిటీగా ఉంటుంది. ఇందులో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉండేలా డిజైన్ చేసుకున్నాడు.
 
మొదటి సినిమా దర్శకుడిలా అనిపించలేదు. భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. కాపాడవలసిన భగవంతుడి ఆగ్రహం తట్టుకోవడం సాధ్యం అవుతుందా..? ‘‘సుబ్రహ్మణ్యపురం’’ లో దాగున్న రహస్యం ఏంటి..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రం ‘‘సుబ్రహ్మణ్యపురం’’ అని చెప్పారు. ఇంటర్వ్యూ చూడండి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments