Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రవ ఇంధనం చల్లి ఆస్ట్రేలియాలో భారత డ్రైవర్‌ సజీవ దహనం

ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఓ డ్రైవర్‌ను కొందరు దుండగులు సజీవ దహనం చేశారు. రోజువారీ విధుల్లో నిమగ్నమైన ఆ యువకుడిపై ఓ మధ్యవయస్కుడు ద్రవం ఇంధనం చల్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (09:18 IST)
ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఓ డ్రైవర్‌ను కొందరు దుండగులు సజీవ దహనం చేశారు. రోజువారీ విధుల్లో నిమగ్నమైన ఆ యువకుడిపై ఓ మధ్యవయస్కుడు ద్రవం ఇంధనం చల్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఒంటిపై పడిన ఇంధనంతో క్షణాల్లో నిప్పంటుకుని బస్‌లో మంటలు చెలరేగాయి. బస్‌ మొత్తం పొగ నిండిపోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. మంటల తాకిడికి బస్‌ డ్రైవర్‌ మన్మీత అలిషెర్‌(29) అక్కడికక్కడే మరణించాడు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ సిటీలో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. బ్రిస్బేన్‌ సిటీలోని పంజాబీ కమ్యూనిటీలో మన్మీత అలిషెర్‌కు మంచి గాయకుడిగా పేరుంది. ఎప్పటిలాగే శుక్రవారం మన్మీత విధుల్లో నిమగ్నమయ్యారు. 9 గంటల ప్రాంతంలో బ్రిస్బేన్‌ కౌన్సిల్‌ బస్‌ను నడుపుతున్నాడు. బ్యూడిసెర్ట్‌ రోడ్‌లో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు బస్‌ ఆపగానే మధ్యవయస్కుడు ఒకరు మన్మీతపైకి ద్రవ ఇంధనాన్ని విసిరాడు. మండే గుణం ఉన్న ఆ ఇంధనంలో తడిసిన మన్మీతకు నిప్పంటుకుంది. 
 
దీంతో బస్‌ మొత్తం పొగతో నిండిపోయింది. ఆపై క్షణాలలోనే మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ఆ సమయంలో బస్‌ ఆగిన ప్రదేశానికి దగ్గర్లో ఉన్న ఓ టాక్సిడ్రైవర్‌ చురుగ్గా స్పందించి బస్‌ వెనక డోర్‌ ద్వారా ప్రయాణికులను బయటికి తీసుకొచ్చాడు. ఈ ఘటనలో డ్రైవర్‌ మన్మీత అక్కడికక్కడే మరణించారు. మన్మీతపై దాడిచేసిన వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments