Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

సెల్వి
శనివారం, 31 మే 2025 (17:11 IST)
Xi Mingze
చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కుమార్తె జి మింగ్జేను బహిష్కరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  పిలుపునిచ్చారు. ట్రంప్ మిత్రురాలు లారా లూమర్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎక్స్‌ ద్వారా చైనా అధ్యక్షుడి కుమార్తెను అమెరికా నుంచి వెలివేయాలని ఆమె ట్వీట్‌తో పిలుపునిచ్చింది. 
 
ఇది అమెరికన్ విశ్వవిద్యాలయాలలో చైనా ఉనికి గురించి కొనసాగుతున్న చర్చలను తీవ్రతరం చేసింది. అమెరికాలో చైనా భద్రతా దళాలు ఆమెను రక్షిస్తున్నాయని ఆధారాలు లేకుండా పేర్కొంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను ఉద్దేశించి రాసిన ఈ పోస్ట్ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను కలిగించింది. అయినప్పటికీ లూమర్ తన వాదనలకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇంకా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను పోస్ట్ కూడా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను కలిగించింది.
 
లూమర్ వ్యాఖ్యలు అమెరికాలోని చైనీస్ విద్యార్థులపై ప్రభావితం చేస్తోంది. ఇటీవల దేశ పౌరులపై, ముఖ్యంగా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP)తో సంబంధాలు ఉన్న లేదా టెక్, ఏఐ వంటి సున్నితమైన విషయాలను అధ్యయనం చేస్తున్న వ్యక్తులపై కొత్త చైనీస్ జాతీయ వీసా పరిమితులను ప్రకటించారు. 
 
"సీసీపీతో సంబంధాలు ఉన్న వారితో సహా చైనీస్ విద్యార్థుల వీసాలను US రద్దు చేయడం ప్రారంభిస్తుంది" అని రూబియో ఎక్స్‌లో రాశారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో చైనీస్ విద్యార్థులు గడ్డుకాలం ఎదుర్కోక తప్పదని టాక్ వస్తోంది. 
 
జి మింగ్జే ఎవరు?
జి మింగ్జే జూన్ 25, 1992న జన్మించారు. ఆమె జి జిన్‌పింగ్, ప్రఖ్యాత చైనీస్ సోప్రానో పెంగ్ లియువాన్ దంపతుల ఏకైక సంతానం. జికి పబ్లిసిటీ ఇష్టం వుండదు. ఇందుకోసం ఆమె రహస్యంగా అమెరికాలో వుంటూ చదువుకుంటోంది. ఆమె తన గుర్తింపు గురించి గోప్యతను కాపాడుకోవడానికి 2010-2014 వరకు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మనస్తత్వశాస్త్రం, ఇంగ్లీష్ చదివింది. 
 
గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె చైనాకు తిరిగి వెళ్లిందని చెబుతుండగా, ఆమె 2019 నాటికి హార్వర్డ్‌లో గ్రాడ్యుయేట్ అధ్యయనాలను తిరిగి ప్రారంభించి ఉండవచ్చని పుకార్లు, సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ప్రస్తుత ఆచూకీ వివరాలు రహస్యంగా వున్నాయి. ఆమె గురించిన వివరాలను అమెరికా లేదా చైనా అధికారులు బయట పెట్టలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments