Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాసా కోసం 7 గ్రహశకలాల్ని కనిపెట్టిన ఏడేళ్ల బాలిక..

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (17:31 IST)
NASA
ఏడేళ్ల వయస్సున్న బాలిక ఎవ్వరూ ఊహించని విధంగా ఏడు గ్రహ శకలాలను కనిపెట్టింది. ఆ బాలిక పేరు నికోల్ ఒలివిరా. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌కి చెందినదీ చిన్నారి. చిన్న వయసులోనే అంతరిక్ష పరిశోధకురాలిగా మారి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కోసం 7 గ్రహశకలాల్ని కనిపెట్టింది. 
 
ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొల్లాబరేషన్.. ఆమధ్య ఆస్టరాయిడ్ హంట్ అనే కార్యక్రమం ప్రారంభించింది. అది సిటిజన్ సైన్స్ ప్రోగ్రాం. ఇందులో ప్రజలు కూడా పాల్గొనవచ్చు. ఇందులో నాసాకి సభ్యత్వం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారి 7 గ్రహశకలాల్ని గుర్తించి… నాసాకు సహాయం చేసి ఔరా అనిపించుకుంది. సర్టిఫికెట్ కూడా పొందింది.
 
చిన్నప్పుడు పిల్లలు రకరకాల బొమ్మలు అడుగుతారు. ఇంట్లో బామ్మలుంటే వారితో కథలు చెప్పించుకుని మురిసిపోతారు. కానీ ఈ ఏడేళ్ల పిడుగు మాత్రం చిన్నపిల్లల్లా బొమ్మలు అడగలేదు. ఏం కావాలని అడిగితే.. ఆకాశంలో నక్షత్రాన్ని చూపించి… అది కావాలని అడిగిందట. దాంతో వాళ్లమ్మ… ఓ నక్షత్రం బొమ్మ కొని ఇచ్చిందట. ఇదేదో ఏదో సరదాగా చెప్పేది కాదు. 
 
నిజమే. దాంతో ఆ చిన్నారికి ఏం కావాలో ఆ తల్లికి అర్థమైపోయింది. ఇప్పుడీ ఏడేళ్ల పాప పలు స్కూళ్లలో ఆస్ట్రానమీ పై ఉపన్యాసాలు ఇస్తోంది. వింటేనే ఎంత ఆశ్చర్యమనిపిస్తోంది. కనీ వినీ ఎరుగని తెలివి ఈ చిన్నారిది అనిపిస్తోంది. మహా మహుల్నే ఆశ్చర్యపడేలా చేస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments