Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల వేటకు తీసుకెళ్లలేదని భర్తను అమ్మకానికి పెట్టిన భార్య...

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (17:32 IST)
కట్టుకున్న భర్తను ఓ భార్య అమ్మకానికి పెట్టింది. తన భర్త ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చని, కానీ ఎక్చేంజ్ లేదంటూ ఓ క్యాప్షన్ పెట్టి ఆమె ఓ ప్రొఫైల్ సిద్ధం చేసింది. కట్టుకున్న భర్తను ఆమె ఇలా అమ్మకానికి పెట్టడానికి ఓ కారణం ఉంది. రోజూ చేపల వేటకు వెళ్లే భర్తను తనను కూడా చేపల వేటకు తీసుకెళ్లాలని కోరింది. అందుకు ఆయన నిరాకరించాడు. అంతే.. ఆమెకు కోపం వచ్చింది. భర్తను అమ్మకానికి పెట్టేసింది. ఈ ఆసక్తికర సంఘటన న్యూజిలాండ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ దేశానికి చెందిన లిండా, జాన్ అనే దంపతులు ఉన్నారు. అయితే, జాన్ చేపల వేటకు వెళ్లేవాడు. ఓ రోజున తనను కూడా చేపల వేటకు తీసుకెళ్లాలని భార్య కోరింది. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. వెంటనే తన భర్తను అమ్ముతున్నట్టుగా ఆ దేశంలోని ప్రముఖ సైట్ 'ట్రేడ్‌మీ'లో ప్రకటన ఇచ్చింది. 
 
తన భర్త ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చని పేర్కొంది. ఇందులో తన భర్త గుణగణాలను వివరించింది. భర్త చాలా మంచివాడని, అందంగా ఉంటాడని, భర్తకు గృహశిక్షణ మాత్రం అవసరమని పేర్కొంది. ఈ ప్రకటన కింద నో ఎక్చేంజ్ అనే క్యాప్షన్‌ను జోడించింది. 
 
ఈ ప్రకటను జాన్ స్నేహితులు గమనించి అతనికి చెవిలో వేశారు. దీంతో ఆయన షాక్ తిన్నాడు. ఆ వెంటనే ట్రేడ్‌మీ వెబ్‌సైట్ నిర్వాహకులను సంప్రదించి ఆ యాడ్‌ను తొలగించాలని కోరారు. కాగా, భార్య చేసిన పనికి జాన్ మాత్రం ఒక్కసారిగా న్యూజిలాండ్ దేశంలో పాపులర్ అయ్యాడు.

సంబంధిత వార్తలు

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ నుంచి ఖలసే సాంగ్ రిలీజ్

పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో అశ్విన్ బాబు శివం భజే చిత్రం

దర్శకుడు తేజ ఆవిష్కరించిన పోలీస్ వారి హెచ్చరిక టైటిల్ లోగో

ఆ గాయంతోనే నింద షూటింగ్ చేశాను : హీరో వరుణ్ సందేశ్

సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్, పాటలు బాగున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments