Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పిపోయిన కుమార్తె కోడలుగా వచ్చింది.. అంతే షాకైన తల్లిదండ్రులు.. చివరికి..?

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (14:34 IST)
అవును.. 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన కుమార్తె కోడలిగా వచ్చింది. అంతే ఆ తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయింది. తన కుమారుడితో జీవితం పంచుకోబోయే కోడలే చిన్ననాట తప్పిపోయిన తన కుమార్తెని ఆమె గుర్తించింది. కొత్త కోడలి చేతిపై పుట్టుమచ్చని చూసి ఇరవై ఏండ్ల కిందట తప్పిపోయిన తన కూతురు ఈమేనని మహిళ నిర్ధారించుకుంది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో మార్చి 31న ఈ ఘటన చోటుచేసుకుంది. పుట్టుమచ్చను పోల్చుకున్న మహిళ నేరుగా వధువు తల్లితండ్రులను ప్రశ్నించగా తమకు చాలా ఏండ్ల కిందట రోడ్డు వెంట పసిపాప కనిపించగా తమ ఇంటికి తెచ్చుకుని సాకామని వారు చెప్పారు.
 
ఈ కథంతా విన్న నవ వధువు కన్నీరుమున్నీరైంది. తనకు జన్మనిచ్చిన తల్లిని గుర్తించడం పెండ్లి కంటే ఆనందంగా ఉందని పేర్కొంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్‌ కూడా వెల్లడైంది. తాను అన్నను పెండ్లాడుతున్నానని పెండ్లి కుమార్తె కలత చెందగా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెండ్లి కొడుకు తన సంతానం కాదని, తాను అతడిని దత్తత తీసుకున్నానని మహిళ పేర్కొనడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 
 
చిన్ననాట తప్పిపోయిన కుమార్తె ఆచూకీ ఎంతకీ తెలియరాకపోవడంతో ఓ బాలుడిని ఆమె దత్తత తీసుకుంది. వారు ఒకే కడుపున జన్మించనందున వారి వివాహం సమస్య కాబోదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక పెండ్లితంతును పూర్తిచేయగా కొత్త జంటను అతిథులు ఆశీర్వదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments