Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మహిళకు ఎంత గుండె ధైర్యం : సింహం ముందు నృత్యం!!

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (13:01 IST)
సాధారణంగా సింహాన్ని చూస్తేనే హడలిపోతుంటాం. అలాంటిది సింహం ముందు నిలబడి నృత్యం చేసే సాహసం ఎవరైనా చేస్తారా? కానీ, న్యూయార్క్‌కు చెందిన ఓ మహిళ ఏకంగా సింహం ఎదుట నిలబడి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, న్యూయార్క్‌కు చెందిన ఓ మహిళ స్థానికంగా ఉండే బ్రాంక్స్ జూకు వెళ్లింది. ఆమె సింహాలను తీక్షణంగా చూసింది. ఆ తర్వాత ఉన్నట్టుండి సింహాలు ఉండే ఎన్‌క్లోజర్‌కు వెళ్లిపోయింది. ఈ దుస్సాహసానికి ఆ మహిళ ఒడిగట్టడంతో ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికిలోనయ్యారు. 
 
సింహాల జోనులోకి వెళ్లిన ఆ మహిళ... నేరుగా ఓ సింహానికి ఎదురుగా నిలబడింది. కొద్దిసేపు డ్యాన్స్ చేసింది. దీన్ని హెర్నెన్‌ రేనోసో అనే వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. ఆ తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది కొన్ని క్షణాల్లోనే వైరలైంది. 
 
అయితే, ఆ మహిళ తీరును ప్రతి నెటిజన్ తప్పబట్టారు. ఇదే ఆనందం అంటూ విమర్శించారు. మరోవైపు, ఆ మహిళ చేసిన పనిని తీవ్ర నేరంగా పరిగణించిన న్యూయార్క్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇంతకీ ఆమె అక్కడ నుంచి తిరిగి ఎలా బయటపడిందన్నదీ తెలియరాలేదు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments