డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

ఠాగూర్
శుక్రవారం, 10 అక్టోబరు 2025 (15:49 IST)
నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఈ పురస్కారంపై గంపెడాశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నిరాశే ఎదురైంది. ఈ యేడాది నోబెల్ శాంతి బహుమతి మరియా కొరీనా మచాడోను వరించింది. ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. 
 
వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకుగానూ ఈ పురస్కారం లభించింది. అయితే, ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ యేడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ అవ్వగా అకాడెమీ సభ్యులు మరియీ వైపు మొగ్గుచూపారు. 
 
వెనెజువెలా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను మచాడోకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని తెలిపింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నానని, గత యేడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని పేర్కొంది. 
 
కాగా, మరియా వెనెజువెలా పార్లమెంట్ సభ్యురాలిగా, దేశ విపక్ష నేతగా పని చేశారు. వెనెజువెలా సైనికీకరణకు తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని నోబెల్ కమిటీ వెల్లడించింది. ఇదిలావుంటే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ పురస్కారంపై ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. ఆయన నామినేషన్‌ను రష్యా, పాకిస్థాన్, కెనడా దేశాలు కూడా ప్రతిపాదించాయి. కానీ, ఆయన నిరాశే మిగిలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments