Webdunia - Bharat's app for daily news and videos

Install App

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

ఠాగూర్
గురువారం, 3 జులై 2025 (20:07 IST)
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య అణు యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో తమ దేశంలో అణు యుద్ధం అంచు వరకు వెళ్లిందని సనావుల్లా సంచలన విషయాన్ని అంగీకరించారు.
 
భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి అణ్వాయుధాన్ని మోసుకొస్తుందా లేదా అని అర్థం చేసుకోవడానికి తమ సైన్యానికి కేవలం 30 నుంచి 40 సెకన్ల సమయం మాత్రమే లభించిందని, అదే తమ తలరాతను నిర్దేశించిందని ఆయన ఒక పాకిస్థాన్ న్యూస్ చానెల్‌కు తెలిపారు. 
 
భారత్ నూర్ ఖాన్ వైమానిక దళంపై బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించినపుడు దాన్ని విశ్లేషించడానికి మా సైన్యానికి కేవలం 30 - 45 సెకన్ల సమయం ఉంది. అంత తక్కువ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడమైనా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఒకవేళ మా వైపు వారు పొరపాటుగా అర్థం చేసుకునివుంటే అది ప్రపంచ వ్యాప్త అణు యుద్ధానికి దారితీసేది అని ఆయన పేర్కొన్నారు. 
 
కాగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది భారత పర్యాటకులను హతమార్చిన విషయం తెల్సిందే. దీంతో భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా, భారత సైన్యం పాకిస్థాన్‌లోని నూర్ ఖాన్,, సర్గోధా, భోలారీ, జాకబాబాద్‌తో సహా పలు వైమానిక స్థావరాలపై దాడులు చేసి రన్‌వేలు, హ్యాంగర్లను ధ్వంసం చేసిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం