Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యూడిపై గంటపాటు వీడియో.. నాసాపై ప్రశంసలు.. నెటిజన్లు ఫిదా (video)

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (12:11 IST)
Sun
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) సూర్యూడిని ఓ గంట పాటు వీడియో షూట్ చేసింది. దీంతో నాసా నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. నాసాకి చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్డీఓ) దశాబ్ద కాలానికి పైగా సూర్యుణ్ని చూస్తోంది. ఇది పదేళ్లలో 42.5 కోట్ల హై రిజల్యూషన్ ఫొటోలు తీసింది. ఈ ఫోటలన్నింటినీ చేర్చి నాసా టైమ్ లాప్స్ వీడియోగా కుదించింది.
 
పదేళ్ల మొత్తం ఫుటేజ్ ఒక గంటకు కుదించింది. ఆ అరుదైన టైమ్ లాప్స్ వీడియోని యూట్యూబ్‌లో ఉంచింది. దశాబ్దకాలపు సూర్యుడు అనే టైటిల్ పెట్టింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  పది సంవత్సరాల పాటు ప్రతిరోజూ ఒక గంట పాటు సూర్యుడిని రికార్డ్ చేసింది.  
 
ఇకపోతే నాసా విడుదల చేసిన ఈ వీడియోలో సూర్యుడిపై భారీ మంటలు, సూర్యకంపాలు, సౌరగాలులు ఇలా ఎన్నో కనిపిస్తున్నాయి. ఇందులో సూర్యగ్రహణాలు కూడా ఉన్నాయి. జూన్ 24న అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడో సెన్సేషన్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను ఆరున్నర లక్షల మంది వీక్షించగా, 7.5వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments