Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బెబ్బే... అది ఎఫ్-16 కాదు.. జేఎఫ్-17 : అమెరికాకు పాక్ బుకాయింపు

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (11:04 IST)
పాకిస్థాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాదుల ఏరివేత కోసం సరఫరా చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలతో భారత్‌పై దాడికి దిగడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. దీంతో పాకిస్థాన్‌పై కన్నెర్రజేస్తోంది. వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో పాక్ ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. తాము భారత్‌పై దాడికి ఉపయోగించిన విమానాలు ఎఫ్-16 విమానాలు కాదనీ, చైనా తయారు చేసిన జేఎఫ్-17 విమానాలని బుకాయించింది. 
 
పాక్‌ ఆక్రమిత కాశ్మీరులో భారతీయ వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 దాడిలో కూలినది ఎఫ్‌-16 అవునో కాదో తేల్చి చెప్పండంటూ అమెరికా హెచ్చరించింది. దీంతో తత్తరపాటుకుగురైన పాకిస్థాన్‌ బుకాయింపునకు దిగింది. 
 
చైనాతో కలసి తాము తయారు చేసుకున్న జేఎఫ్‌-17 యుద్ధ విమానంతోనే ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ నడుపుతున్న మిగ్‌-21ను పాక్‌ ఆక్రమిత కాశ్మీరులో కూల్చివేశామంటూ పాకిస్తాన్‌ ప్రభుత్వం అమెరికాకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. 
 
ఎఫ్‌-16 విమానాలను దేశాలపై దాడులకు వీటిని ఉపయోగించరాదన్న షరతును ఉల్లంఘించడంపై పాక్‌ వివరణ కోరినట్లు ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీ ప్రతినిధి ఒకరు తెలియచేశారు. 'రెండు దేశాల మధ్య ఒప్పందంలో ఏముందో నాకు తెలియదు. కానీ ఆ కూలింది మాత్రం నిస్సందేహంగా ఎఫ్‌-16యుద్ధ విమానమే! దానికి అమ్రామ్‌ క్షిపణిని కూడా అమర్చారు. ఎఫ్‌-16లకు మాత్రమే వాటిని అటాచ్‌ చేస్తారు' అని భారత వైమానిక దళ చీఫ్‌ ధనోవా స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments