Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా కరోనా టీకా తీసుకున్న జో బైడెన్

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (08:34 IST)
అమెరికా దేశానికి కాబోయే కొత్త అధ్యక్షుడు జో బైడెన్ కరోనా టీకా వేయించుకున్నారు. అదీకూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా ఆయన ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారు. తన స్వస్థలమైన డెలావర్‌లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, వ్యాక్సిన్ వల్ల భయపడడానికి ఏమీ లేదన్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నిపుణుల సూచనలు పాటించాలని అన్నారు. 
 
వైరస్ నుంచి బయటపడడానికి ఇది ఆరంభం మాత్రమేనని, మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడేందుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని బైడెన్ పేర్కొన్నారు.
 
కాగా, గతవారం అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దంపతులు కూడా వ్యాక్సిన్ షాట్ తీసుకున్నారు. అయితే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మొదటి మహిళ మెలానియా ట్రంప్ మాత్రం ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోలేదు. 
 
అమెరికాలో ఇటీవలే ఫైజర్ టీకా అందుబాటులోకి వచ్చింది. యూఎస్ రెగ్యులేటరీ ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంతో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments