Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా టీకా తీసుకున్న జో బైడెన్.. భయపడనక్కర్లేదు..

Advertiesment
Nothing To Worry About
, మంగళవారం, 22 డిశెంబరు 2020 (07:55 IST)
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ కరోనా టీకా తీసుకున్నారు. డెలావర్‌లోని క్రిస్టియానా ఆసుపత్రిలో 78 ఏళ్ల బైడెన్‌ ఫైజర్‌ వ్యాక్సీన్‌ మొదటి డోసు ఇచ్చారు. బైడెన్‌కు వ్యాక్సినేషన్‌ను అమెరికా టీవీ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. 
 
వ్యాక్సీన్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల్లో అపోహను తొలగించడానికే తాను టీకా వేసుకుంటున్నట్టు తెలిపారు బైడెన్‌. టీకా వేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. టీకా తీసుకుంటున్న సందర్భంలో బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ ఆయన పక్కనే ఉన్నారు. ఆమె అంతకు ముందురోజే వ్యాక్సీన్‌ తీసుకున్నారు. 
 
ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అమెరికా ఆహార, ఔషద నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతి లభించిన నేపథ్యంలో టీకా కార్యక్రమం మొదలైంది. గత వారం నుంచే అమెరికాలో పెద్దఎత్తున కరోనా టీకాను ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు అయిన ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. 
 
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు అమెరికాలో సుమారు మూడు లక్షల 20 వేల మంది చనిపోయారు. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో ప్రజలంతా ఒక్కచోట చేరే అవకాశం ఉండడంతో మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని జో బైడెన్‌ అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నచ్చలేదు పొమ్మంది.. బ్రేకప్ ఇచ్చేశానంది.. అంతే నడిరోడ్డుపై నరికేశాడు..